Reading Time: < 1 minute
India Could Become Worlds No 1 Economy Jeffrey Sachs Predicts Major Shift

India: ప్రపంచ సంక్షోభాల మధ్య భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే చెప్పాయి. ఇప్పుడు అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన ఆర్థికవేత్త జేఫ్రీ సాక్సా్ భారత్ నెంబర్-1 ఆర్థిక వ్యవస్థగా మారతుందని సంచలన అంచనా వేశారు. సమీపం భవిష్యత్తులో భారత్ అమెరికా, చైనాలను దాటి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని చెప్పారు.

రాబోయే 25 ఏళ్లలో అమెరికాను భారత్ అధిగమించి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని, చివరకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికశక్తిగా అవతరించవచ్చని జేఫ్రీ సాక్స్ చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కేంద్రం నిర్ణయాత్మకంగా ఆసియా వైపు మారుతోందని సాక్స్ పేర్కొన్నారు. భారత్-చైనాలు ఒకరికి ఒకరు అవసరమని అన్నారు. ఈ రెండు ఆసియా దిగ్గజాలు ప్రపంచ ఆర్థిక శక్తులుగా మారుతాయని, అదే సమయంలో అమెరికా మూడో స్థానానికి పడిపోతుందని జోస్యం చెప్పారు. చైనాతో భారత్‌కు లోతైన ఆర్థిక, సాంకేతిక సంబంధాలు భారత్ ఎదిగే వేగాన్ని మరింత పెంచొచ్చని వెల్లడించారు.

భారత్‌కు చైనా ఎంత అవసరమో, చైనాకు భారత్ అంతే అవసరమని చెప్పారు. ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక కేంద్రంగా ఉన్న ఆసియా, తిరిగి మళ్లీ ఆ స్థానాన్ని చేజిక్కించుకుంటుందని జేఫ్రీ సాక్స్ అన్నారు. చైనా, ఆసియాన్, ఆఫ్రికా మరియు గల్ఫ్ దేశాలతో భారతదేశ వ్యూహాత్మక మరియు ఆర్థిక సంబంధాలు మరింత ముఖ్యమైనవిగా మారతాయని ఆయన అన్నారు.