Reading Time: < 1 minute
Uk Break Up Fears Scotland Wales And Northern Ireland Leaders Push For Self Determination

UK Break-Up: యునైటెడ్ కింగ్‌డమ్ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ నేతలు తమ ప్రాంతాలకు స్వయం నిర్ణయం హక్కు, స్వాతంత్య్రం దిశగా కీలక అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం కార్డిఫ్‌లో జరిగే సమావేశంలో యూకే నుంచి స్వాతంత్ర్యం సాధించేందుకు డిక్లరేషన్‌పై సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న వెస్ట్ మినిస్టర్ ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ జాన్ స్విన్నీ, వేల్స్ ఫస్ట్ మినిస్టర్ రున్ అప్స్ ఐయోర్వెత్, ఉత్తర ఐర్లాండ్ నాయకత్వంతో పాటు సిన్ ఫెయిన్ అధ్యక్షురాలు మేరీ లూ మెక్‌డొనాల్డ్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ నేతలంతా స్వయం నిర్ణయ హక్కును సమర్థిస్తూ జాయింట్ డిక్లరేషన్‌పై సంతకం చేసే అవకాశం ఉంది.

ముక్కలు కానున్న యూకే..?

ఇటీవల ఎన్నికల ఫలితాలు స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లో రాజ్యాంగ మార్పులకు అనుకూలంగా ఉన్న పార్టీలు సత్తా చాటాయి. స్కాట్లాండ్ ఫస్ల్ మినిస్టర్ జాన్ స్విన్నీఈ బ్రేక్ అప్ పరిణామాన్ని యూకే రాజ్యాంగ వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడికి సంకేతంగా అభివర్ణించారు. స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌కు తొలిసారిగా స్వాతంత్ర్య అనుకూల ఫస్ట్ మినిస్టర్లు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత రాజ్యాంగ స్థితి శాశ్వతం కాదని, వెస్ట్‌మినిస్టర్ ప్రభుత్వం యూకే తర్వాతి భవిష్యత్తుపై సిద్ధం కావాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు.