Reading Time: < 1 minute
Maharashtra Ferris Wheel Accident Woman Suffers Severe Scalp Injury After Hair Gets Caught

Maharashtra: సరదా కోసం ‘‘జెయింట్ వీల్’’ ఎక్కడ ఒక మహిళ ప్రాణాలు పోయే పరిస్థితికి తెచ్చింది. మహారాష్ట్ర యావత్మాల్ జిల్లాలో ఒక జాతరలో జరిగిన ఘోర ప్రమాదంలో, ఒక మహిళ జుట్టు జెయింట్ వీల్‌లో చిక్కుకుంది. వేగంతా తిరిగే సమయంలో ఇలా జరగడంతో ఆమె జడతో పాటు తలపై ఉన్న మొత్తం చర్మం ఊడిపోయి తీవ్రగాయాలపాలైంది. బేరింగ్‌లో జట్టు చిక్కుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

యావత్మాల్ జిల్లా మహాగావ్ తాలూకాలో శుక్రవారం తన్హా పోలా పండగ సందర్భంగా జాతర నిర్వహించారు. సమీప గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు జాతరకు వచ్చారు. పునేశ్వర్ మహాదేశ్ ఆలయంలో ప్రత్యేక పూజలు, దర్శనాల కోసం భక్తులు తరలి వచ్చారు. మహిళ జెయింట్ వీట్ ఎక్కితన తర్వాత ఆమె సీటు వెనుక భాగంలో ఉన్న తిరిగే బేరింగ్‌లో చిక్కుకుంది. వేగంగా తిరుగుతుండటంతో ఆమె జట్టు చర్మంతో సహా ఊడి వచ్చింది.

ఈ ప్రమాదంలో ఒక్కసారిగా జాతరకు వచ్చిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తీవ్ర గాయాలతో రక్తస్రావం అవుతున్న మహిళను చూసి ఆందోళన చెందారు. వెంటనే విధుల్లో ఉన్న ఏఎస్ఐ సునీల్ అంభూరే స్థానికుల సాయంతో వేగం తిరుగుతున్న జెయింట్ వీల్‌ను నిలిపేశారు. చికిత్స కోసం బాధిత మహిళను ఆస్పత్రికి తరలించారు.