Reading Time: < 1 minute

శబ్దకాలుష్యానికి వ్యతిరేకంగా నాగ్ పూర్ లో నిరసనలు..మౌనంగా ఆందోళన చేస్తున్న స్థానికులు 

Caption of Image.

శబ్ద కాలుష్యంపై నాగ్ పూర్ వాసులు వినూత్న నిరసనలు చేపట్టారు. పండుగల వస్తే చాలు హై  డెసిబుల్ మ్యూజిక్ లు, పెరుగుతున్న సౌండ్ పొల్యూషన్ కు వ్యతిరేకంగా మౌన ప్రదర్శనలు  చేశారు.గణేష్ ఉత్సవానికి ముందు, పెరుగుతున్న శబ్ద కాలుష్యానికి, హైడెసిబుల్ మ్యూజిక్ డివైజ్ లను వాడకానికి వ్యతిరేకంగా నాగ్‌పూర్‌కు చెందిన పలువురు నివాసితులు ఆదివారం వీధుల్లోకి వచ్చి మౌన ప్రదర్శన నిర్వహించారు. పెరుగుతున్న సౌండ్ పొల్యూషన్ తో వృద్దులు, గర్భిణీలు, చిన్న పిల్లలతో సహా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. 
 
సౌండ్ పొల్యూషన్  తగ్గించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ మౌనంగా ఆందోళన వ్యక్తం చేశారు. మేం ఏ పండుగకి వ్యతిరేకం కాదు, ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు.. ఒకటి స్పష్టం చేయాలనుకుంటున్నారు.  లేజర్ కిరణాలు, హౌ డెసిబుల్ సౌండ్ బాక్సులను వాడటం వల్ల ఇళ్లలోని  వృద్దులు, రోగులు, చిన్ని పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. చెవిలో కర్ణభేరీ దెబ్బతినడం, రెటీనాలు చిట్లిపోవడం వంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.  సౌండ్ పొల్యూషన్ సమస్య తీరేంతవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. 

ప్రతియేటా  భాద్రపద మాసంలో జరిగే నాగ్ పూర్ లో ప్రధాన సంస్కృతికి  సాంప్రదాయం మర్బత్ ఉత్సవం జరిగిన ఒకరోజు తర్వాత  ఈనిరసనలు తలెత్తాయి. ఈ ఉత్సవంలో దుష్టశక్తులు, సామాజిక  దురాచాలు, సమాజాన్ని  ప్రభావితం చేసే సమస్యలకు ప్రతీకగా భారీ దిష్టి బొమ్మలతో వేలాది మంది ఊరేగింపులో పాల్గొంటారు.శనివారం నాడు  ఈ ఉత్సవాలు పెద్ద ఎత్తున మ్యూజిక్ నినాదాలు మారుమోగాయి. 

రోజురోజుకు దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో పాటు  గ్రామీణ ప్రాంతాల్లో సైతం  సౌండ్ పొల్యూషన్ పెరిగిపోతోంది.  పెరుగుతున్న వాహనాలు, ఫ్యాక్టరీలుతో పాటు పండుగలు, ఫంక్షన్లకు హై డెసిబుల్ బ్యాండులు, డీజేలను వాడకంతో సౌండ్ పొల్యూషన్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్న క్రమంలో ప్రభుత్వాలు, పొల్యూషన్ కంట్రోల్ సంస్థలు పరిష్కార మార్గాలను, చర్యలు చేపట్టాల్సిన అవసరం తప్పనిసరి. 

©️ VIL Media Pvt Ltd.