Reading Time: < 1 minute

శంషాబాద్ దగ్గర కంటైనర్ బోల్తా.. – హైదరాబాద్-బెంగళూరు హైవే పై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

Caption of Image.

హైదరాబాద్-బెంగళూరు హైవేపై భారీ ప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల దగ్గర  కంటైనర్ బోల్తా పడింది. 2026 ఆగస్టు 23న జరిగిన ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కంటైనర్ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో హైవేపై  కిలోమీటర్ల మీర వాహనాలు నిలిచిపోయాయి.

సుమారు మూడు గంటలుగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ తో వాహనాల్లోనే ఉండిపోవడంతో చిన్నపిల్లలు మహిళలు అవస్థలు పడుతున్నారు 
సమాచారం అందుకున్న పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో కంటైనర్ ను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణా నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.