Reading Time: 2 minutes

Super Food : పదే పది నిమిషాల్లో తయారీ: మసాలా బ్రెడ్ టోస్ట్.. పైగా ఆరోగ్యం కూడా..!

Caption of Image.

సిటీలో దాదాపు అందరూ వర్కింగ్​ ఉమెన్స్​.. పొద్దున్నే వారి హడావిడి అంతా ఇంతా కాదు..పిల్లలను రడీ చేయాలి.. వారికి బ్రేక్​ ఫాస్ట్​.. లంచ్​.. భర్తకు లంచ్​ బాక్స్​  తాను కూడా అంతో ఇంతో తిని పనికి వెళ్లాలి.  కొన్ని రోజులు బ్రేక్​ ఫాస్ట్​ తినడం కూడా మానేస్తారు.. అలాంటి వారికి పదే పది నిమిషాల్లో టేస్టీగా ఉండే ఆరోగ్యకరమైన మసాలా బ్రెడ్​ టోస్ట్​ ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుదాం. . ! 

ఒక్క బ్రేక్​ ఫాస్ట్​గా గానే కాదు … లంచ్​ .. డిన్నర్​ గా కూడా తినొచ్చు.  దీన్ని తయారు చేయడానికి పెద్దగా ఏ పదార్దాలు అవసరం లేదు.  ఇంట్లో ఉండే రెగ్యులర్​ గా వాడేవాగితోనే 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్​ అయితే ఇక చెప్పనక్కరలేదు.  . వంట రాని వాళ్లు కూడా దీన్ని ఇట్టే చేసుకోవచ్చు.

మసాలా బ్రెడ్ టోస్ట్ తయారీకి కావాల్సిన పదార్థాలు 

  • బ్రెడ్ స్లైసెస్ – తగినన్ని 
  • శనగపిండి – 3 టేబుల్ స్పూన్లు 
  • పెరుగు – 1 టేబుల్ స్పూన్స్​ 
  • ఉల్లిపాయ – 1 పెద్దది 
  • టమాటో – 1 
  • జీలకర్ర పొడి – అర టీస్పూన్ 
  • గరం మసాలా – 1 టీస్పూన్
  •  కారం – అర టీస్పూన్
  •  ఉప్పు – అర టీస్పూన్
  • కొత్తిమీర – కొద్దిగా 
  • నూనె – అర టీస్పూన్
  •  ఆవాలు – కొద్దిగా
  •  కరివేపాకు – రెండు రెమ్మలు
  •  నీళ్లు – పిండి కలుపుకోవడానికి తగినన్ని

మసాలా బ్రెడ్ టోస్ట్ తయారీ విధానం

టమాటాలను.. ఉల్లిపాయను సన్నగా ముక్కలు తరగాలి.  తరువాత వెడల్పాటి గిన్నెలో  వీటిని వేసి అందులో జీలకర్ర, ఉప్పు, గరం మసాలా , కారం, శనగపిండి, పెరుగు  వేసి కొద్ది కొద్దిగా నీళ్లుపోసుకుంటూ బాగా కలపాలి.  బజ్జీల పిండిలా ఉండే విధంగా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి.  ఇప్పుడు కొత్తిమీరను వేసి మరోసారి బాగా కలపాలి.  

ఇప్పుడు బ్రెడ్​ స్లైస్​ ను తీసుకొని  పైన తెలిసిన మిశ్రమంలో ముంచాలి.. ఈ స్లైస్​ కు ఇరు పక్కలా ఉల్లిపాయ ముక్కలు.. టమాటాముక్కలు అంటుకొనిఉండేలా చూసుకోవాలి. అయితే బ్రెడ్​ ను పిండిలో ఎక్కువ సేపు ఉంచకూడదు.  అలా ఉంచితే విరిగిపోతుంది

ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి…  కళాయిలో సరిపడ నూనెపోసి కాగనివ్వాలి.  నూనె వేడెక్కిన తరువాత కొద్దిగా ఆవాలు.. కరివేపాకు వేయాలి.   ఇప్పుడు  స్టవ్​ పై మరో పక్క పెనం పెట్టి.. పిండిలో ముంచిన బ్రెడ్​ స్లైస్​ ను పెనంపై వేయించాలి.  వేయించేటప్పుడు ఆవాలు.. కరివేపాకు ఉన్న నూనెను స్లైస్​పై చల్లాలి.  సన్నని మంటపై బ్రౌన్​ కలర్​కు వచ్చే వరకు కాల్చాలి.  

 ఇప్పుడు  రెండో వైపునకు తిప్పి దోరగా కాల్చాలి.  అంతే వీటిని ఇంట్లో ఉండే ఏ చట్నీతో తిన్నా సూపర్​ గా ఉంటుంది.  పైగా ఇందులో ఉపయోగించే పదార్ధాలన్ని ఎంతో ఆరోగ్యమైనవి.. కూడా.. మరి ఇంకెందుకు ఆలస్యం పదే పది నిమిషాల్లో కమ్మని మసాలా బ్రెడ్ టోస్ట్ ను ఓ సారి ట్రై చేద్దామా మరి..! 

©️ VIL Media Pvt Ltd.