
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ ట్రాన్స్ పోర్ట్ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని ఆయన నివాసంలో ED అధికారులు కారుమూరి వెంకట నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీసుకు పోలీసులు తరలిస్తున్నారు. కాగా.. ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కారుమూరి కుమారుడు సునీల్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే.. ఏపీ లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ కేసులో.. కారుమూరి నాగేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.