Reading Time: 2 minutes

OTT Thriller: ఓటీటీలో సస్పెన్స్ ట్విస్టులతో తెలుగు థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Caption of Image.

వర్సటైల్ యాక్టర్ జగపతిబాబు, నటి లయ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సైకలాజికల్ సస్పెన్స్ అండ్ ఫ్యామిలీ థ్రిల్లర్ ‘వదల’ (Vadala). ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. కుటుంబ బంధాలు, మానసిక భావోద్వేగాలు మరియు ఊహించని మలుపులతో ఈ సినిమా తెరకెక్కంది. ఒక అందమైన కుటుంబంలోకి అనుకోని వ్యక్తి ప్రవేశం కారణంగా జరిగే పరిణామాలు, ప్రేమ మరియు మోహం చుట్టూ తిరిగే కొన్ని భయానక, ఉత్కంఠభరితమైన అంశాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. సస్పెన్స్ జోనర్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంటోంది.

కథేంటంటే:

శ్రీమంతుడైన డాక్టర్‌ యోగి (జగపతిబాబు) భార్య ప్రియ (లయ), పిల్లలు అప్పూ, చింటూతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. ప్రియ తండ్రి కూడా వారితోనే ఉంటాడు. ఓ ప్రమాదంలో గాయపడిన అముద (హృతిక శ్రీనివాస్)కు యోగి చికిత్స చేయించి, క్రమంగా ఆ కుటుంబానికి దగ్గరవుతున్న అముద.. యోగి, ప్రియల అన్యోన్యతను చూసి అసూయపడుతుంది. వారి ఆనందాన్ని దెబ్బతీయాలని నిర్ణయించుకుని, యోగికి కొత్త నంబర్ల నుంచి సందేశాలు పంపడం, బహుమతులు, పూలు పంపడం మొదలుపెడుతుంది. దీంతో ప్రియకి భర్తపై అనుమానం మొదలవుతుంది.

మరోవైపు పదేళ్ల క్రితం దీపావళి రోజు సిలిండర్ పేలడంతో మరణించిన నివాస్ (అవసరాల శ్రీనివాస్) కుటుంబానికి సంబంధించిన కేసులో కొత్త ఆధారం బయటపడుతుంది. పోలీస్ అధికారి పద్మాకర్ ఆ క్లూను పట్టుకుని దర్యాప్తు మొదలుపెడతాడు. నివాస్ కుటుంబానికి ఏం జరిగింది? ఆ ప్రమాదం వెనుక అసలు నిజమేంటి? అముద యోగి కుటుంబానికి ఎందుకు దగ్గరవుతుంది? ఆమె వల్ల యోగి, ప్రియ, వారి పిల్లల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేదే మిగతా కథ.

►ALSO READ | Zombie Reddy 2 Glimpse: ‘జాంబీ రెడ్డి 2’ గ్లింప్స్‌ గూస్‌బంప్స్.. నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లనున్న జాంబీ వరల్డ్!

ఎలా ఉందంటే:

జగపతిబాబు, లయ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘వదల’ కుటుంబ భావోద్వేగాలు, అనుమానం, మోహం, ప్రతీకారం వంటి అంశాలను సైకలాజికల్ థ్రిల్లర్ శైలిలో చెప్పిన చిత్రం. కథ నెమ్మదిగా ప్రారంభమైనా, ఒక్కో క్లూతో ఉత్కంఠను పెంచుతూ చివరి వరకు ఆసక్తిని నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే, ఫస్టాఫ్ కొంత నెమ్మదిగా సాగుతుంది. కొన్ని సన్నివేశాల్లో లాజిక్ కంటే డ్రామాకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే పోలీసు ఇన్వెస్టిగేషన్ ట్రాక్ మరింత బలంగా ఉండాల్సింది. 

©️ VIL Media Pvt Ltd.