Reading Time: 2 minutes

కంప్లయింట్ ఇస్తే తీసుకోరా : పోలీస్ స్టేషన్ ఎదుట రాహుల్ గాంధీ ధర్నా

Caption of Image.

ఢిల్లీలో పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ. జంతర్ మంతర్ దగ్గర పెల్లెట్ గన్స్ తో తీవ్రంగా గాయపడిన బాధితులు.. కంప్లయింట్ ఇవ్వటానికి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. వాళ్ల కంప్లయింట్ ను పోలీసులు తీసుకోవటం లేదన్న విషయం తెలిసి.. రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగారు. 

విషయం తెలుసుకుని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన రాహుల్ గాంధీ.. పెల్లెట్ గన్స్ బాధితులతో కలిసి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను కలిశారు. కంప్లయింట్ ఎందుకు తీసుకోవటం లేదు.. కేసు ఎందుకు నమోదు చేయటం.. FIR ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు. బాధితులు డాక్టర్ సర్టిఫికెట్లతో సహా కంప్లయింట్ ఇవ్వటానికి వస్తే.. ఎందుకు కేసు తీసుకోవటం లేదంటూ.. పోలీస్ స్టేషన్ ఎదుట బాధితులతో కలిసి ధర్నాకు దిగారు రాహుల్ గాంధీ.

►ALSO READ | Govinda Komal Rani: గోవిందా జీవితంలో కోమల్ రాణి ఎవరు? భార్య సునీత ఆరోపణలతో బాలీవుడ్లో భారీ ట్విస్ట్!

రాహుల్, సాహిల్ మొదట కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, ఆ తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లోని డీసీపీ ఆఫీసుకు వెళ్లారు. పోలీసులు ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని కోరారు రాహుల్ గాంధీ.

“ఎఫ్‌ఐఆర్ లేదు. న్యాయం లేదు. అందుకే ధర్నా చేస్తాం,” అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. FIR నమోదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. FIR నమోదు చేసేవరకు ధర్నా విరమించేది లేదని తేల్చి చెప్పారు రాహుల్.

జూలై 24న సాహిల్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో , జూలై 20న పార్లమెంటు వైపు సీజేపీ జరిపిన మార్చ్ సందర్భంగా ఢిల్లీ పోలీసులు పెల్లెట్ గన్‌లను ఉపయోగించారని రాహుల్ ఆరోపించారు, అయితే ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండించింది. ప్రభుత్వం అబద్ధాలు చెప్పడం ఆపి, విద్యార్థులపై లాఠీఛార్జ్ జరిగిందని… పెల్లెట్ గన్‌లను ఉపయోగించారని అంగీకరించాలని డిమాండ్ చేశారు రాహుల్.

ఆ తర్వాత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఒక లేఖ రాసి, సీజేపీ నిరసనకారులపై జరిగిన “క్రూరమైన దాడి”కి సమాధానం ఇవ్వాలని కోరారు.సాహిల్ తన లాయర్లతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వగా, పోలీసులు ఐ/ఓ నంబర్ ఇవ్వడానికి నిరాకరించారని ఆరోపిస్తున్నారు. ఆగస్టు 17న, సాహిల్ మరోసారి ఇమెయిల్, ఫోన్ ద్వారా ఐ/ఓ నంబర్ కోసం అడిగినప్పటికీ, ఎటువంటి స్పందన రాలేదని అంటున్నారు. 

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకే సీజేపీ నిరసనకారులపై పెల్లెట్ గన్‌తో కాల్పులు జరిపారని కాంగ్రెస్ ఆరోపించింది. సాహిల్, అతని తల్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేసినా పోలీసులు వారిని పట్టించుకోలేదని కూడా పేర్కొంది. అంతేకాకుండా, సాహిల్‌కు ఎలాంటి మెడికో లీగల్ కేస్ నివేదిక కూడా అందించలేదని ఆరోపించింది. 

©️ VIL Media Pvt Ltd.