Reading Time: 2 minutes
Swine Flu: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో స్వైన్ ఫ్లూ (H1N1) కలవరం.. ప్రధాన లక్షణాలు ఇవే

Swine Flu: డిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో H1N1 (స్వైన్ ఫ్లూ) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం నెలకొన్న తేమతో కూడిన వాతావరణం, మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు కూడా ఉద్ధృతమవుతున్నాయి. కొందరిలో ఆక్సిజన్ స్థాయిలు అకస్మాత్తుగా పడిపోవడం, తీవ్రమైన శ్వాస సమస్యలు ఎదురవుతున్నట్లు వైద్యులు తెలిపారు..ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు సైతం H1N1 బారిన పడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క డిల్లీలోనే 1,349కి పైగా H1N1 కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: House Construction: ఇంటి నిర్మాణంలో చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏదో తెలుసా..? ఇది ఇల్లు బలానికే పెద్ద దెబ్బ..!

గత సంవత్సరంతో ఇదే సమయానికి 229 కేసులతో పోలిస్తే ఇది దాదాపు ఆరు రెట్లు ఎక్కువగా నమోదయ్యాయి. ఆసుపత్రులకు చేరుతున్న రోగులలో జ్వరం, దగ్గు వంటి సాధారణ ఫ్లూ లక్షణాలతో పాటు శ్వాసకోశ ఇబ్బందులు ఆందోళన కలిగిస్తున్నాయి.శ్వాస ఆడకపోవడం, ఛాతీలో తీవ్రమైన నొప్పి, నిరంతరంగా కొనసాగే అధిక జ్వరం, గందరగోళం, పెదవులు, గోర్లు నీలం రంగులోకి మారడం వంటి సంకేతాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

వృద్ధులు, ఐదేళ్లలోపు చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, మధుమేహం (డయాబెటిస్), దీర్ఘకాలిక గుండె లేదా ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు,రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు త్వరగా H1N1 స్వైన్ ఫ్లూ బారిన పడే అవకాశం ఉంటుంది. అధిక ప్రమాదం ఉన్న రోగులకు, మోస్తరు నుంచి తీవ్రమైన లక్షణాలు ఉన్నవారికి సకాలంలో వైద్యం అందించడం అత్యంత ముఖ్యం అని వైద్యులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Chicken Prices: మాసం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన చికెన్‌ ధర.. ఎంతో తెలిస్తే ఎగబడి కొంటారు..!

హెచ్1ఎన్1 (H1N1) ప్రధాన లక్షణాలు

అకస్మాత్తుగా వచ్చే జ్వరం, చలి

పొడి దగ్గు, గొంతు నొప్పి

తీవ్రమైన ఒళ్ళు నొప్పులు తలనొప్పి

విపరీతమైన అలసట, నీరసం.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం.

వైద్యుల సూచనలు

సకాలంలో ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకోవడం, ఎప్పటికప్పుడు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం,దగ్గు తుమ్ము సమయంలో చేతికి టవల్ అడ్డుపెట్టుకోవడం,అనారోగ్యంతో ఉన్నవారు ఇళ్లకే పరిమితం కావడం మరియు ఇతరులకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు..వర్షాకాలపు తేమ వాతావరణంలో శ్వాసకోశ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Hyderabad: తెలంగాణలో భూములకు రికార్డు ధర.. ఎకరం రూ.264 కోట్లు.. ఎవరు కొన్నారో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి