Reading Time: < 1 minute
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రోజే ‘తల్లికి వందనం’ డబ్బులు జమ! దరఖాస్తుకు మరో ఛాన్స్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ‘తల్లికి వందనం’ నిధుల విడుదలకు సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. పాఠశాలల్లో మొదటి తరగతి (1st Class) లో చేరిన చిన్నారులతో పాటు, జూనియర్ కళాశాలల్లో చేరిన ఇంటర్ ఫస్టియర్ (Inter First Year) విద్యార్థులకు ఆగస్టు నెల 30వ తేదీన ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద నిధులను మంజూరు చేయనుంది.

గత నెలలో ఈ పథకం కింద అర్హత సాధించినప్పటికీ, వివిధ రకాల సాంకేతిక (Technical) సమస్యల వల్ల లబ్ధి పొందని వారికి కూడా అదే రోజున ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు లేదా వివరాలు అప్‌డేట్ చేసుకోని వారు ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

నూతనంగా చేరిన విద్యార్థులు, అలాగే సాంకేతిక కారణాలతో ఆగిపోయిన వారు కలిపి సుమారు 2.78 లక్షల మంది వరకు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం రూ.13,000 చొప్పున నేరుగా జమ చేయనుంది. అర్హత ఉండి ఇప్పటివరకు లబ్ధి పొందని విద్యార్థుల తల్లిదండ్రులు వెంటనే తమ సచివాలయాన్ని సంప్రదించి, ఈ నెల 25లోగా ఇ-కేవైసీ (e-KYC), బ్యాంక్ ఖాతా లింకేజ్ మరియు సాంకేతిక సమస్యలను పరిష్కరించుకోవాలని అధికారులు సూచించారు. విద్యార్థుల చదువులకు ఆర్థిక సాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ వేగవంతమైన చర్యలు చేపట్టింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..