Reading Time: < 1 minute

సెప్టెంబర్ 15 నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు… ఏర్పాట్లు పరిశీలించిన టీటీడీ అదనపు ఈవో

Caption of Image.

కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా వాహన సేవలు జరిగే మాడ వీధుల్లో ఏర్పాట్లు పరిశీలించారు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి.

భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో.. మాడ వీధుల్లో భక్తుల సౌకర్యం, భద్రతకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు వెంకన్న చౌదరి. వాహన సేవలను భక్తులు సులభంగా వీక్షించేలా గ్యాలరీలు, బారికేడింగ్, క్యూలైన్లు తదితర ఏర్పాట్లను పరిశీలించారు.

అదేవిధంగా మాడ వీధుల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్‌ వెలుగులు, వైద్య సేవలు వంటి సదుపాయాలపై అధికారులతో సమీక్షించారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని సూచించారు. వాహన సేవల సమయంలో మాడ వీధుల్లో భక్తుల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

బ్రహ్మోత్సవాలకు వచ్చే ప్రతి భక్తుడికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ, జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు వెంకయ్య చౌదరి.

©️ VIL Media Pvt Ltd.