Reading Time: < 1 minute

Dharmasthala Niyojakavargam: పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్

Caption of Image.

నటరాజ్, రాయంచ కొక్కుర, సుమన్, సాయికుమార్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, వితిక షేరు, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో  మెరుం భాస్కర్ నిర్మిస్తున్నారు.  సెప్టెంబర్ 4న  పీవీఆర్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదలవుతోంది.

తాజాగా నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో సుమన్ మాట్లాడుతూ ‘ఇందులో మంచి క్యారెక్టర్ చేశా. ఈ కథ మీద నాకు మొదటినుంచీ నమ్మకం ఉంది. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు. నటిగా మంచి పేరుతెచ్చే పాత్ర పోషించానని వితికా షేరు చెప్పింది.

ఇదొక పొలిటికల్ బ్యాక్‌‌డ్రాప్ మూవీ అని, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుందని దర్శకుడు  జై జ్ఞాన ప్రభ తోట చెప్పాడు.  ఈ సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నామని నిర్మాత మేరుం భాస్కర్ అన్నారు. నటులు నటరాజ్, కస్తూరి సహా టీమ్ అంతా పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.