Reading Time: < 1 minute
A New Trend At The Tollywood Box Office Good Times Are Back For Mid Budget Films

సూర్య–వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వచ్చిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తోంది. ఆగస్టు 14న విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్ల గ్రాస్ సాధించింది. ఓవర్సీస్ లో రూ. 45 కోట్లు రాబట్టింది. ఇప్పటికీ మంచి కలెక్షన్స్ తో సక్సెస్ రన్ కొనసాగిస్తూ. ఇప్పుడు రూ. 200 కోట్ల క్లబ్ లోకి చేరడానికి రెడీ అయ్యింది.

ఒకప్పుడు థియేటర్లలో సినిమాను నిలబెట్టాలంటే బిగ్ స్టార్, భారీ బడ్జెట్, భారీ హైప్ తప్పనిసరి అన్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ లెక్క కాస్త మారుతున్నట్టే కనిపిస్తోంది. ‘మా ఇంటి బంగారం’ రూ. 100 కోట్ల మార్క్ దాటగా అదే సమయంలో కేవలం రూ. 25 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ‘డీసీ’ 14 రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌కు చేరువైంది. అంటే స్టార్ పవర్ కంటే కంటెంట్, మౌత్ టాక్, ఎంటర్‌టైన్‌మెంట్ వాల్యూ ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే సంకేతం ఇది. మిడ్-బడ్జెట్ సినిమాలకు మళ్లీ థియేట్రికల్ మార్కెట్ పెరుగుతోందని ఈ సినిమాలే ప్రూవ్ చేస్తున్నాయి.
కొరియన్ కనకరాజు’, చెన్నై లవ స్టోరీ ఎబోవ్ యావరేజ్ టాక్‌తో బాగానే రాబట్టింది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ప్రేక్షకులు ఓటీటీకి పూర్తిగా షిఫ్ట్ కాలేదు. వాళ్లకు నచ్చే సినిమా కనిపిస్తే ఇప్పటికీ టికెట్ కొనడానికి సిద్ధంగానే ఉన్నారు. కాబట్టి థియేట్రికల్ మార్కెట్‌లో మిడ్-బడ్జెట్ సినిమాలకు కూడా స్పేస్ ఉందనే నమ్మకం మేకర్స్‌లో పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ ట్రెండ్‌ను చూసి “టాలీవుడ్‌లో ఇక ప్రతి సినిమా థియేటర్లలో ఆడుతుంది” అని చెప్పలేరు. ఎందుకంటే ఈ సినిమాల విజయానికి కంటెంట్‌తో పాటు మౌత్ టాక్, రిలీజ్ టైమింగ్, ప్రమోషన్, టికెట్ ప్రైసింగ్ కూడా కీలకం. బ్లాక్‌బస్టర్, డిజాస్టర్ అనే రెండు ఎక్స్‌ట్రీమ్స్ మధ్య ‘డీసెంట్ సినిమా’ కూడా థియేటర్‌లో నిలబడగల మార్కెట్ మళ్లీ ఏర్పడుతోందా అంటే ఈ మధ్య వస్తున్న వరస సినిమాల బిజినెస్ పాజిటివ్ సిగ్నల్ ఇస్తోంది.