Reading Time: 2 minutes
Toxic Pre Release Event : టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. కిందపడిన భారీ సౌండ్ సెట్.. విద్యార్థులకు గాయలు..

పాన్ ఇండియా స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ టాక్సిక్. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా శనివారం రాత్రి హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీ దులపల్లి లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున విద్యార్థులు, అభిమానులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే హీరో యష్ మాట్లాడుతుండగా కుప్పకూలిన భారీ సౌండ్ బాక్స్ సెట్ కిందపడింది. ఒక్కసారిగా కిందపడిన భారీ సౌండ్ సెట్ కిందపడడంతో విద్యార్థులు గాయపడినట్లు సమాచారం. దీంత ఇద్దరికి కాళ్లు విరిగినట్లు సమాచారం. గాయపడిన వారిలో ఓ అమ్మాయి స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఈవెంట్ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బిగ్‏బాస్‏లోకి ఈశ్వర సాయి, మాధురి రాథోడ్.. ఆది రెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ?

ఈ ఘటనతో విద్యార్థులు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు, నిర్వాహకులు రంగంలోకి దిగి వారికి సర్దిచెప్పడంతో గందరగోళ వాతావరణం సర్దుమణిగింది. ఎమ్మెల్యే మల్లారెడ్డి సైతం విద్యార్థులను సముదాయించాల్సి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరుకావడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని టాక్.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ హీరో మాములోడు కాదు.. నెంబర్ వన్ ఫ్రాడ్.. సీనియర్ నటుడు సురేష్..

టాక్సిక్ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించగా.. ఇందులో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ఆగస్ట్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఎక్కువ మంది చదివినవి : Sowcar Janaki: షావుకారు జానకి మనవరాలు తెలుగులో పెద్ద హీరోయిన్.. చాలా ఫేమస్.. ఎవరో

 

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: రహస్య బావిలో మహిళ అరుపులు.. భయంతో వణికిపోవాల్సిందే.. ఓటీటీని ఊపేస్తున్న హారర్ థ్రిల్లర్..