
సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘జైలర్ 2’. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు పీక్స్ కు చేరాయి. లేటెస్ట్ గా రజనీ ఫ్యాన్స్ కు మేకర్స్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి సాంగ్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాను ఊపేస్తోంది.
‘జైలర్’ సినిమాలో తమన్నా ‘ కావాలా’ సాంగ్ తో కుర్రకారును ఒక ఊపు ఊపేసింది. ఇప్పుడు అదే రేంజ్ లో ‘అల బోలెలో’ (Ala Bolelo) అంటూ మరో అల్టిమేట్ మాస్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇది అభిమానులకు పూనకాలు తెప్పించేస్తోంది. అయితే ఇందులో తమన్నా ప్లేస్ లో టాలీవుడ్ నటి పూర్ణ ఎంట్రీ ఇచ్చేసింది. ఈ సాంగ్ లో తమన్నాను ఏమాత్రం తీసిపోని విధంగా ఆమె వేసిన స్టెప్పులు, ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ హైలైట్ గా నిలిచాయి.
►ALSO READ | హిందూ-ముస్లిం మైండ్‌సెట్ నుంచి బయటకు రండి.. షర్మిలాకు కంగనా స్ట్రాంగ్ రిప్లై!
రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ కు థియేటర్లలో దద్దరిల్లడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఫుల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. . డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సీక్వెల్ ను ఏమాత్రం తగ్గకుండా ప్లాన్ చేశాడు. ఇక ఈ మూవీలో పాత గ్యాంగ్ రమ్యకృష్ణ, యోగిబాబు, మిర్నా మీనన్ ఉండనే ఉన్నారు. వాళ్లకు తోడుగా మోహన్ లాల్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, ఎస్.జె. సూర్య లాంటి ఉద్దండులు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఈ సినిమాతోనే తమిళంలోకి ఎంట్రీ ఇస్తుండటం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. రజనీకాంత్, హృతిక్ ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో కన్పించనుండంతో మరింత హైప్ తీసుకోస్తోంది
ఈ మూవీ కి రజనీకాంత్ తన డబ్బింగ్ వర్క్ ను కంప్లీట్ చేసినట్లు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. అటు ప్రమోషన్స్ ను కూడా స్పీడప్ చేశారు చిత్ర బృందం. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీని అక్టోబర్ 15న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధం చేస్తున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.