Reading Time: 2 minutes

సివిల్ డ్రెస్ లో బైక్ పై వచ్చిన సజ్జనార్.. కేబీఆర్ పార్క్ చుట్టూ తిరిగి..

Caption of Image.

హైదరాబాద్ సీపీ సజ్జనార్ సామాన్యుడిలా సివిల్ డ్రెస్ లో బైక్ పై తిరిగారు.గురువారం ( ఆగస్టు 20 ) ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాధారణ పౌరుడిలా బైక్ పై ప్రయాణించారు సజ్జనార్. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఇటీవల అమల్లోకి వచ్చిన వన్ వే ట్రాఫిక్ విధానాన్ని స్వయంగా పరిశీలించారు సజ్జనార్. బైక్ పై ప్రయాణించి క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ ను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు సజ్జనార్.

ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి జూబ్లీ చెక్ పోస్ట్,వెంకటగిరి, కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్, ముగ్ద జంక్షన్, బసవతారకం హాస్పిటల్, అగ్రసేన్ చౌరస్తా, ఫిలింనగర్ జంక్షన్ మీదుగా రోడ్ నంబర్ 45 వరకు రెండుసార్లు బైక్ పై ప్రయాణించి ట్రాఫిక్ ను పరిశీలించారు సజ్జనార్.

అనంతరం మధ్యాహ్నం కూడా మరోసారి ట్రాఫిక్ ను పర్యవేక్షించారు సజ్జనార్. అగ్రసేన్‌ చౌరస్తా, ఫిల్మ్‌నగర్‌, జర్నలిస్ట్‌ కాలనీ, జూబ్లీ చెక్‌పోస్ట్‌, కేబీఆర్‌ మెయిన్ గేట్, సహా ఇతర ప్రధాన కూడళ్లలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందితో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు సజ్జనార్.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ సాఫీగా సాగుతోందని అన్నారు సజ్జనార్. బుధవారం నుంచి వన్ వే అమల్లోకి తెచ్చామని.. మొదటిరోజు లేన్ల మార్పిడి కారణంగా వాహనదారులు కొంచెం అయోమయానికి గురైనప్పటికీ.. ఇవాళ రాకపోకలు సాఫీగా సాగుతున్నాయని అన్నారు సజ్జనార్. వాహనదారులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జంక్షన్లలో సైన్ బోర్డులు ఏర్పాటు చేశామని అన్నారు. దీంతో పాటు తగినంత మంది సిబ్బంది కూడా మోహరించామని అన్నారు సజ్జనార్.

హెచ్ సిటీ ప్రాజెక్టు పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు జీహెచ్ఎంసీ, కంస్ట్రక్షన్ ఏజెన్సీతో సమన్వయం చేస్కుంటూ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు సజ్జనార్. పనులు పూర్తయ్యేవరకు నగరవాసులు సహకరించాలని.. ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని కోరారు సజ్జనార్.

©️ VIL Media Pvt Ltd.