Reading Time: < 1 minute
Pranay Reddy Vanga Interview Sandeep Reddy Vanga Prabhas Spirit Shooting Updates

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సెట్‌లో చాలా పక్కాగా, రాజీ పడకుండా పనిచేస్తారని ఆయన సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ తెలిపారు. తాజాగా ఎన్టీవీ పాడ్ కాస్ట్ షోలో పాల్గొన్న ఆయన ఈ మేరకు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా ప్రేక్షకులందరూ ఆసక్తికరంగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఈ సినిమా సెట్ లో తన సోదరుడు సందీప్ రెడ్డి వంగా ఎలా ఉంటాడు అనే విషయం మీద ఈ మేరకు కామెంట్లు చేశారు.

ప్రతి డిపార్ట్‌మెంట్‌పై సందీప్‌కు పూర్తి పట్టు ఉండటంతో పాటు ఎడిటింగ్, ఫ్రేమింగ్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యాన్ని సహించరని అన్నారు. చిన్నపాటి వేస్టేజ్ జరిగినా సందీప్ వెంటనే గమనిస్తారని, సెట్‌లో అంతా అనుకున్నట్లుగా రావడానికి అవసరమైన సందర్భాల్లో టీమ్‌కు గట్టిగానే క్లాస్ (కోటింగ్) పీకుతారని ప్రణయ్ గుర్తుచేసుకున్నారు. తాను ఏం తీయాలనుకుంటున్నాడో సందీప్ కి క్లారిటీ ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రొడక్షన్ వేస్టేజ్ కాకుండా ఆయన చూసుకుంటారని చెప్పుకొచ్చాడు ప్రణయ్. అంతేకాక ఇప్పటివరకు స్పిరిట్ సినిమాకి సంబంధించి 50 రోజుల షెడ్యూల్ జరిగితే ఒక్కరోజు కూడా తాము అనుకున్న బడ్జెట్ దాటి వేస్టేజ్ జరగలేదని చెప్పుకొచ్చాడు.