Reading Time: < 1 minute

న్యాయ విద్యార్థులకు స్కిల్స్ ఇంపార్టెంట్ : హైకోర్టు రిటైర్డ్జడ్జి జస్టిస్ రాధారాణి

Caption of Image.
  • చిక్కడపల్లి పెండేకంటి లా కాలేజీలో ఇండక్షన్ మెరిట్ ఫెస్టివల్ .

ముషీరాబాద్, వెలుగు: న్యాయవిద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు స్కిల్స్ ఇంపార్టెంట్ అని హైకోర్టు రిటైర్డ్​జడ్జి జస్టిస్ రాధారాణి అన్నారు. శనివారం చిక్కడపల్లిలోని పెండేకంటి లా కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఇండక్షన్ మెరిట్​ఫెస్టివల్​నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆమెతోపాటు బోర్డ్ ఆఫ్ స్టడీస్ లా చైర్మన్ డాక్టర్ రాధికా యాదవ్ హాజరై, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. 

అనంతరం జస్టిస్ రాధారాణి మాట్లాడుతూ.. న్యాయ విద్యను చదవడం అంతా సులభమైన విషయం కాదని, దానికోసం నిరంతరం శ్రమ అవసరమని తెలిపారు. డాక్టర్ రాధిక యాదవ్ మాట్లాడుతూ.. విద్యార్థులకు సమగ్ర శిక్షణ తరగతి గదిలోనే మొదలవుతుందని, క్రమం తప్పకుండా తరగతులకు హాజరు కావాలని సూచించారు. కార్యక్రమంలో సత్యేంద్ర, ఉమా వెంకట సుబ్బలక్ష్మి, పార్థసారథి, పి.అరవింద, లెక్చరర్లు పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.