
డీసీ.. గత రెండు వారాలుగా ఈ సినిమా పేరు తెగ వినిపిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఊహించని కలెక్షన్లు సాధిస్తోంది. పోటీగా వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ సినిమా ఉన్నా డీసీ సినిమాకు సాలిడ్ ఓపెనింగ్స్ వచ్చాయి. అల్లు అర్జున్, మహేష్ బాబు తదితర స్టార్ హీరోలు సైతం డీసీ సినిమాను చూసి ప్రశంసలు కురిపించారంటే ఈ మూవీలో ఎంత స్ట్రాంగ్ కంటెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఖైదీ, మాస్టర్, లియో, కూలీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ డీసీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కెప్టెన్ మిల్లర్ తో జాతీయ అవార్డు అందుకున్న అరుణ్ మాథేశ్వరన్ ఈ మూవీని తెరకెక్కించాడు. గతంలో పలు తెలుగు సినిమాల్లో నటించిన వామికా గబ్బి ఈ యాక్షన్ థ్రిల్లర్ లో కథానాయికగా చేసింది. ఆగస్టు 07న తెలుగు, తమిళం భాషల్లో రిలీజైన డీసీ సినిమా ఇప్పటికే రూ. 75 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. రెండు వారాలు గడిచినా ఈ సినిమాకు సాలిడ్ కలెక్షన్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీసీ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
డీసీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్ట్స్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అయితే స్ట్రీమింగ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. థియేటర్లలో రిలీజైన నాలుగు లేదా ఆరువారాల తర్వాతే ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉన్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 11 లేదా 18వ తేదీల్లో ఏదో ఒక రోజు ఈ సినిమా స్ట్రీమింగ్ కు రావొచ్చని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు ఇప్పటికీ మంచి కలెక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఓటీటీ రిలీజ్ డేట్ ఇంకా పొడిగించే అవకాశం కూడా ఉంది.
డీసీ సినిమాలో లోకేశ్ కనగరాజ్, వామికా గబ్బి..
When Madness meets Madness
#DC@Dir_Lokesh @ArunMatheswaran @anirudhofficial #WamiqaGabbi @isanjkayy @mukesh_DOP @editor_prasanna @skannanartdir @PC_stunts @kabilanchelliah @kuchirayar73 @RIAZtheboss pic.twitter.com/n1Xqk3AGoK
— Sun Pictures (@sunpictures) August 20, 2026
డీసీ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి హీరోయిన్లు గా నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు.
డీసీ సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
