Reading Time: < 1 minute

ఆగస్టు 27 నుంచి 20వ గ్రాండ్ నర్సరీ మేళా

Caption of Image.
  • బ్రోచర్ ఆవిష్కరించిన మంత్రి తుమ్మల

హైదరాబాద్, వెలుగు: ఆలిండియా హార్టికల్చర్, అగ్రికల్చర్ షోను ఈనెల 27 నుంచి ఐదు రోజులపాటు నిర్వహించనున్నారు. 20వ గ్రాండ్ నర్సరీ మేళాకు సంబంధించిన హార్టికల్చర్ షో బ్రోచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఆవిష్కరించారు. మెడిసినల్ ప్లాంట్స్, ఇండోర్, అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డోర్ ప్లాంట్స్, పూల మొక్కలు, పండ్ల మొక్కలు తదితర అన్నీ ఒకే వేదికపై కొనుగోలు చేసే అవకాశాన్ని హార్టికల్చర్ శాఖ కల్పించింది.

ఈ మేళా ఆగస్టు 27 నుంచి 31 వరకు ఐదు రోజులపాటు హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏ గ్రౌండ్ (ఐమ్యాక్స్ థియేటర్ వద్ద)లో జరగనుంది. వివిధ రకాల పూలు, అలంకరణ మొక్కలు, పండ్లు, కూరగాయల మొక్కలు, వివిధ రకాల కుండీలు, కంపోస్ట్ తదితర ఉత్పత్తులు ఈ మేళాలో అందుబాటులో ఉండనున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 100కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు నర్సరీ మేళా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్ ఖాలీద్ అహ్మద్ తెలిపారు.

మొక్కల పెంపకంపై ఆసక్తి ఉన్నవారంతా ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.20వ గ్రాండ్ నర్సరీ మేళా బ్రోచర్​ను ఆవిష్కరిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రంలో జాహెద్​ అహ్మద్​

©️ VIL Media Pvt Ltd.