
అతనో సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్, నెలకు రూ. ఐదు లక్షలు సంపాదిస్తున్నాడు. అయినా భార్య చేతిలో చావు తప్పలేదు. పిల్లలకు మందులు వేసే విషయంలో మందలించాడని బంధువులతో కలిసి భర్తను హతమార్చింది భార్య. ఢిల్లీలో జరిగింది ఈ దారుణం. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి…
వినయ్ గుప్తా, రేఖలకు మూడున్నరేళ్ల క్రితం పెళ్లయ్యింది. వీరికి కవలలైన ఒక బాబు, ఒక పాప ఉన్నారు. వినయ్ అడోబ్ కంపెనీలో 60 లక్షల ప్యాకేజితో ఉద్యోగం చేస్తున్నాడు. రేఖ హౌస్ వైఫ్ గా ఉంటోంది. పిల్లలకు మందులు వేసే విషయంలో వినయ్, రేఖ మధ్య గొడవ జరిగిందని, వినయ్ మందలించడంతో కోపంతో రేఖ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని తెలిపారు వినయ్ తల్లి. ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత పుట్టింటివారితో కలిసి తిరిగి వచ్చిన రేఖ వినయ్ పై దాడికి దిగిందని తెలిపారు వినయ్ తల్లి.
రేఖ తన ఇద్దరు సోదరులు, వదిన, తండ్రి, మామ, మరో వ్యక్తితో కలిసి వచ్చిందని… ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఇంట్లోనే వినయ్‌పై దాడి చేశారని తెలిపారు వినయ్ తల్లి.ఇంటికి వచ్చినవారికి మంచి నీళ్లు తెచ్చేందుకు బయటికి వెళ్లానని.. ఆ సమయంలో దాడి జరిగిందని తెలిపారు బాధితుడి తల్లి.
అందరు కలిసి వినయ్ ను చావగొట్టారని… గొంతు నులిమి, చేతులు, కాళ్లతో అతని ఛాతీపై కొట్టారని తెలిపారు. తాము అడ్డుపడ్డప్పటికీ ఆగకుండా వినయ్ పై దాడి చేశారని తెలిపారు వినయ్ తల్లిదండ్రులు. పక్కా ప్లాన్ తోనే ఈ దాడి చేశారని అంటున్నారు. దాడికి ముందు రేఖ ఇంట్లోని సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేశారని ఆరోపిస్తున్నారు.
రేఖ, వినయ్ తరచూ గొడవపడేవారని.. రేఖ సోదరులు వినయ్ ని చంపేస్తామని గతంలో బెదిరించారని తెలిపారు బంధువులు. వినయ్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో వినయ్ భార్య రేఖ, ఆమె ఇద్దరు సోదరులు, మరో వ్యక్తి ఉన్నట్లు తెలిపారు.