Reading Time: < 1 minute

మ్యాపింగ్ జరగని ఓటర్లందరికి నోటీసులు.. గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

Caption of Image.

గద్వాల, వెలుగు: మ్యాపింగ్ జరగని ఓటర్లందరికి  నోటీసులు ఇవ్వాలని జోగులాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ క్యాంప్ ఆఫీస్ నుంచి జిల్లాలోని అన్ని మండలాల ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, అదనపు ఏ ఈ ఆర్ వో ల లతో ఆయన గూగుల్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మ్యాపింగ్ జరగని ఓటర్లందరికి నోటీసులు జారీ చేసి నిర్దేశిత తేదీలో అవసరమైన డాక్యుమెంట్స్ తో హియరింగ్  కు హాజరయ్యేలా చూడాలన్నారు. అనామలీస్ ఓటర్ల విషయంలోనూ ఎన్నికల సంఘం రూల్స్ అనుసరించి ముందుకు వెళ్లాలని చెపారు.

పేరులేని అర్హులైన ఓటర్లు తిరిగి ఫాం-6 ద్వారా ఓటు హక్కు దరఖాస్తు చేసుకునేందుకు సహకరించాలన్నారు. ధరూర్ మండల కేంద్రంలో కేజీబీవీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాల తో ముందుకు సాగాలని సూచించారు. 

©️ VIL Media Pvt Ltd.