Reading Time: < 1 minute
Raidurg Land Auction Record Price Hyderabad

Raidurg Land: తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) నిర్వహిస్తున్న భూముల వేలం పాటల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రికార్డులు తిరగరాసింది. నగరంలోని అత్యంత ఖరీదైన ఐటీ కారిడార్ అయిన రాయదుర్గం పరిధిలోని ప్లాట్ నంబర్ P1కి సంబంధించి నిర్వహించిన ఈ వేలంలో ఎకరం భూమి ఏకంగా రూ. 264 కోట్ల రికార్డు ధర పలికింది. ప్లాట్ విస్తీర్ణం మొత్తం 5.25 ఎకరాలు ఉండగా, ఎకరాకు రూ. 264 కోట్ల చొప్పున లెక్కగడితే ఈ స్థలం మొత్తం విలువ రూ. 1,386 కోట్లకు చేరింది.

వేలం చేజిక్కించుకున్న MSN రియాల్టీస్

రంగారెడ్డి జిల్లా రాయదుర్గం ప్రాంతంలో ఉన్న ఈ అత్యంత విలువైన స్థలాన్ని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ‘MSN రియాల్టీస్’ పోటీపడి దక్కించుకుంది. ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఆదాయాన్ని తెచ్చిపెట్టిన ఈ వేలం ప్రక్రియ అధికారికంగా ముగిసింది. నగరంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఉన్న డిమాండ్‌తో పాటు ఐటీ కారిడార్ విస్తరణ, మౌలిక వసతుల పెంపు కారణాల వల్లే రాయదుర్గం భూములకు ఈ స్థాయిలో అనూహ్య ధర లభించిందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.