Reading Time: < 1 minute

Health tips: వర్షాకాలంలో కిడ్నీ, యూరినరీ సమస్యలు.. డాక్టర్లు చెబుతున్న నివారణ మార్గాలివే

Caption of Image.

వర్షాకాలం వేడి నుంచి రిలీఫ్ ఇచ్చినప్పటికీ మారుతున్న వాతావరణం మన ఆరోగ్య దినచర్యపై కూడా ప్రభావం చూపుతుంది. వాటిలో ఒకటి వర్షాకాలంలో దాహం. వేసవిలో ఉన్నంత దాహం వర్షాకాలంలో అనిపించదు. కాబట్టి  చాలామంది తక్కువ నీరు తాగుతారు. ఇలా చేయడం వల్ల కిడ్నీలో రాళ్లు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు (UTI) వచ్చే ప్రమాదం పెరుగుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చల్లని వాతావరణంలోనూ శరీరానికి తగినంత నీరు అందడం చాలా అవసరమని సూచిస్తున్నారు. వర్షాకాలంలో కిడ్నీ సమస్యలు, నివారణ మార్గాలపై డాక్టర్లు చెబుతున్న సలహాలు సూచనల గురించి తెలుసుకుందాం. 

వర్షాకాలంలో దాహం తక్కువగా వేయడంతో చాలామంది నీరు తాగడం తగ్గిస్తారు. అయితే రోజూ తగినంత నీరు తాగకపోతే కిడ్నీలో రాళ్లు, మూత్రనాళ ఇన్ఫెక్షన్ (UTI) వచ్చే ప్రమాదం పెరుగుతుందని మహరాష్ట్ర డోంబివ్లిలోని AIMS హాస్పిటల్‌ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ,ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ వివేక్ జాధావో హెచ్చరిస్తున్నారు. 

కిడ్నీలో రాళ్లు ఉంటే  లక్షణాలు..

  • వీపు లేదా పక్క భాగంలో తీవ్రమైన నొప్పి
  • మూత్రం సమయంలో మంట లేదా నొప్పి
  • మూత్రంలో రక్తం లేదా దుర్వాసన
  • తరచూ మూత్ర విసర్జన
  • జ్వరం, చలి, వికారం

కిడ్నీరాళ్లు ఏర్పడకుండా ఎలా నివారించాలి?

  • రోజుకు 2నుంచి 3 లీటర్ల శుభ్రమైన నీరు తాగాలి.
  • ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకోవాలి
  • వ్యక్తిగత పరిశుభ్రత పాటించి, పొడి కాటన్ లోదుస్తులు ధరించాలి
  • కలుషిత నీరు, జంక్ ఫుడ్, అధిక ఉప్పు తీసుకోవడం తగ్గించాలి 
  • తాజా ఆహారం, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి

వర్షాకాలంలో చల్లగా ఉందని నీరు తగ్గించడం అనేది చిన్న విషయం కాదు. సరైన నీటి అలవాటు, పరిశుభ్రత, సమయానికి చికిత్సతో కిడ్నీలు ,మూత్ర వ్యవస్థను ఆరోగ్యంగా కాపాడుకోవచ్చంటున్నారు డాక్టర్లు. 

గమనిక: ఈ ఆర్టికల్ లో చెప్పిన చిట్కాలు ,సూచనలు కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. వీటిని డాక్టర్ సలహాగా తీసుకోకూడదు. సమస్యలు ఉంటే డాక్టర్ ను సంప్రదించాలి. 

©️ VIL Media Pvt Ltd.