
Treesa Jolly, Gayatri Gopichand: వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత డబుల్స్ జోడీ ట్రీసా జాలీ– గాయత్రి గోపీచంద్ సంచలనం సృష్టించింది. ఈరోజు (ఆగస్టు 21, శుక్రవారం) జరిగిన హై-వోల్టేజ్ క్వార్టర్ ఫైనల్లో చైనా దిగ్గజ జంట జియా యి ఫాన్ – జాంగ్ షు షియాన్‌ను చిత్తుగా ఓడించారు. ఫస్ట్ గేమ్ ఓడిపోయినా, నెక్స్ట్ లెవెల్ కంబ్యాక్ ఇస్తూ 16–21, 21–15, 21–13 తేడాతో విక్టరీ సాధించారు. దీంతో సెమీఫైనల్స్ చేరిన భారత జంట, కనీసం కాంస్య (బ్రాంజ్) పతకాన్ని ఖాయం చేసుకుని చరిత్ర పుటల్లోకెక్కింది. కాగా 2011లో జ్వాలా గుత్తా – అశ్విని పొన్నప్ప తర్వాత వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన రెండో భారత మహిళల జంట వీరిదే. గాయం నుంచి కోలుకుని రీ-ఎంట్రీ ఇచ్చిన ఈవెంట్లోనే ఈ రేంజ్ డామినేషన్ చూపించి సత్తా చాటడం విశేషం.
చైనాకు చుక్కలు చూపించిన భారత్:
గతంలో చైనా జోడీతో తలపడిన మూడుసార్లు ఓడిపోయిన ట్రీసా–గాయాత్రి, ఈసారి మాత్రం వాళ్లకు కోర్టులోనే చుక్కలు చూపించారు. గంటా 9 నిమిషాల పాటు సాగిన ఈ థ్రిల్లింగ్ మ్యాచ్‌లో మొదటి గేమ్ 16–21తో చైనా వశమైనప్పటికీ, ఇండియన్స్ ప్లేయర్స్ ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు. సెకండ్ గేమ్‌లో మొదట్లో 5–1తో వెనుకబడిన ఆ తర్వాత ఊహించని రీతిలో కంబ్యాక్ ఇచ్చి, నెట్ దగ్గర పవర్‌ఫుల్ షాట్లతో చైనా ప్లేయర్ల ప్లాన్స్‌ను కంప్లీట్‌గా దెబ్బకొట్టారు. సెకండ్ గేమ్‌ను 21–15తో కైవసం చేసుకుని మ్యాచ్‌ను డిసైడర్‌కి తీసుకెళ్లారు.
డిసైడర్ గేమ్‌లో మాస్ ర్యాంపేజ్.. కోర్టులోనే సెలబ్రేషన్స్:
అసలైన డిసైడర్ మూడో గేమ్‌లో భారత జంట ఫుల్ అటాకింగ్ మోడ్‌లోకి వెళ్ళిపోయింది. ఆరంభంలోనే 11–5తో భారీ లీడ్ సాధించి చైనా ప్లేయర్స్ పై తీవ్ర ఒత్తిడి పెంచారు. గాయత్రి ఫ్లాట్ ఎక్స్‌చేంజ్‌లు, ట్రీసా జంప్ స్మాష్‌లకు చైనా జోడీ దగ్గర సమాధానమే లేకపోయింది. ఒకదాని తర్వాత ఒకటి అన్‌ఫోర్స్డ్ ఎర్రర్స్ చేస్తూ చైనా ప్లేయర్లు చేతులెత్తేశారు. చివరకు 9 మ్యాచ్ పాయింట్లు సాధించిన భారత జోడీ, 21–13తో విజయాన్ని అందుకోగానే ట్రీసా జాలీ ఆనందంతో కోర్టులోనే కింద పడిపోయి సెలబ్రేట్ చేసుకుంది.
ALSO READ : CSKకి మరో బిగ్ షాక్.. జట్టును వీడబోతున్న మైఖేల్ హస్సీ..
గాయం నుంచి కంబ్యాక్.. నెక్స్ట్ టార్గెట్ గోల్డ్ మెడల్:
ఈ ఏడాది ఆరంభంలో ట్రీసా యాంకిల్ ఇంజ్యూరీతో నెట్ ప్రాక్టీస్‌కే దూరమైంది. కఠినమైన రిహాబిలిటేషన్ పూర్తి చేసుకుని రీసెంట్‌గానే కోర్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చిన ఈ అర్జున అవార్డీ గ్రహీతలు, ఫిలిప్పీన్స్ టోర్నీ గెలిచి ఫుల్ కాన్ఫిడెన్స్‌తో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కి ఎంట్రీ ఇచ్చారు. 2022, 2023లలో ఆల్ ఇంగ్లాండ్ సెమీస్‌కి చేరి, 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో బ్రాంజ్ నెగ్గిన ఈ జోడీ, ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సెమీస్ చేరి పతకం ఖాయం చేసుకుంది. మరి రేపు (ఆగస్టు 22, శనివారం) జరగబోయే సెమీఫైనల్లో కూడా ఇదే రేంజ్ విక్టరీ కొట్టి ఫైనల్‌కి దూసుకెళ్తారో లేదో చూడాల్సిందే.