Reading Time: < 1 minute

మంథని మున్సిపాలిటీ పరిధిలోని డంప్ యార్డులో చెత్త వేసినందుకు రూ.10 వేల జరిమానా

Caption of Image.

మంథని, వెలుగు: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని డంప్ యార్డులో చెత్త వేసిన వ్యక్తికి మున్సిపల్ అధికారులు రూ.10 వేల జరిమానా విధించారు. నిబంధనలకు విరుద్ధంగా లారీలో చెత్త తీసుకొచ్చి వేసినందుకు చర్యలు తీసుకున్నారు. 

మున్సిపల్ పరిధిలో ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా, నిర్దేశించిన ప్రదేశాల్లోనే చెత్తను వేయాలని అధికారులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

©️ VIL Media Pvt Ltd.