
కూకట్పల్లి, వెలుగు: దురుద్దేశంతోనే ప్రైవేట్భూములను 22ఏలో చేర్చారని, చేసిందంతా చేసి కాంగ్రెస్ ప్రభుత్వంనాటకం ఆడుతోందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాల క్రితం ప్రజలు కొనుగోలు చేసి, ఇండ్లు నిర్మించుకున్న వసంతనగర్కాలనీ, సీబీసీఐడీ కాలనీ, సర్దార్పటేల్నగర్, సాయినగర్ భూములను 22ఏలో చేర్చటం దారుణమన్నారు.
గురువారం కూకట్పల్లిలోని తన ఆఫీస్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిషేధిత జాబితాలో చేర్చిన భూముల అంశాన్ని తాను గతంలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని, అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడటానికే ఇలా చేశారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తుల వేలం ఆపాలని, నిషేధిత జాబితా నుంచి ప్రజల భూములను తొలగించాలని డిమాండ్చేశారు. లేకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్నాయకుడు లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు పాల్గొన్నారు.