Reading Time: 2 minutes
Megastar Chiranjeevi: నా దృష్టిలో ఎప్పటికీ ఆయనే అసలైన హీరో.. చిరుపై పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్.. మెగాస్టార్ రియాక్షన్ ఇదే..

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేడు (ఆగస్ట్ 22). సినీరంగంలో మెగా అభిమానులకు ఈరోజు పండగ వాతావరణమనే చెప్పాలి. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే ఆయన తమ్ముడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం చిరుతో తనకున్న అనుబంధం, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సుధీర్ఘ ట్వీట్ చేశారు. అలాగే చిన్నప్పటి ఫోటోస్, స్పెషల్ వీడియో షేర్ చేస్తూ తనకు ప్రాణమైన అన్నయ్యకు బర్త్ డే విషెస్ చెప్పారు. ” అన్నయ్య గురించి ఆలోచించడం ఎప్పుడూ నాకు అమితమైన ఆనందానని ఇస్తుంది. ఆయన నర్సాపూర్ కాలేజీ చదువుకునే రోజుల్లో వేసవి సెలవులకు ఇంటికి వస్తే మా ఇంట్లో పండగ వాతావరణం ఉండేది. సెలవులు ముగిసి ఆయన మళ్లీ కాలేజీకి వెళ్తుంటే ఇల్లంతా బోసిపోయినట్లు ఉండేది. ఆయన పక్కన నడుస్తుంటే ప్రపంచంలోఅత్యంత ముఖ్యమైన వ్యక్తితో కలిసి నడుస్తున్నట్లు అనిపించేది. ఆయనను అభిమానంతో ఆరాధించేవాడిని. వెండితెరపై హీరో కాకముందే నా దృష్టిలో ఆయనే అసలైన హీరో”అంటూ రాసుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: రహస్య బావిలో మహిళ అరుపులు.. భయంతో వణికిపోవాల్సిందే.. ఓటీటీని ఊపేస్తున్న హారర్ థ్రిల్లర్..

అన్నయ్య పెళ్లయినప్పుడు ఆయన మాకు దూరమైపోతారేమోనని ఒక గదిలో కూర్చుని ఏడుస్తుంటే.. వదినను నా దగ్గరకు తీసుకొచ్చి రా ఈరోజు నీకో పెద్ద మనిషిని పరిచయం చేస్తాను అంటూ నన్ను ఆటపట్టించాడు. నా ఏడుపుకు కారణం తెలిసి ఇద్దరూ నవ్వుకున్నారు. తర్వాత నన్ను మద్రాసుకు తీసుకెళ్లి వారు చూపించిన ప్రేమ మాటల్లో చెప్పలేను. మద్రాసు ఎండల్లో ఉక్కపోతలో 18 గంటలపాటు కష్టపడి చెమటతో తడిసిన దుస్తులతో అర్థరాత్రి నిలబడే ఓపిక కూడా లేని స్థితిలో ఆయన ఇంటికి రావడం నేను చూశాను. ఆయన త్యాగాల మీద బతుకుతున్నందుకు ఎంతో గిల్టీగా ఫీలయ్యేవాడిని. కానీ నేను చదువులో విఫలమైనా.. నా జీవితానికి సరైన దిశ లేకపోయినా ఏనాడు ఒక్కమాట అనలేదు. అందరికి మెగాస్టార్ అయినా.. నాకు మాత్రం ఎప్పటికీ ఏకైక హీరో. నా ప్రియమైన అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు..

ఎక్కువ మంది చదివినవి : Sowcar Janaki: షావుకారు జానకి మనవరాలు తెలుగులో పెద్ద హీరోయిన్.. చాలా ఫేమస్.. ఎవరో

పవన్ కళ్యాణ్ ట్వీట్ కు మెగాస్టార్ చిరంజీవి సైతం రిప్లై ఇచ్చారు. “ప్రియమైన కళ్యాణ్ బాబూ, నీ మాటలు మన జీవితంలోని అత్యంత మధురమైన ఘట్టాలను నాకు గుర్తుచేసి, నన్ను ఎంతో భావోద్వేగానికి గురిచేశాయి. నా ప్రేమ మరియు త్యాగంగా నువ్వు భావించేవి, నిజానికి నీ అన్నయ్యగా నా బాధ్యత మరియు అనురాగం మాత్రమే. ఈ రోజు నీ అచంచలమైన ధైర్యం, ప్రజల పట్ల నీకున్న అంకితభావం మరియు మన భారత్ పట్ల నీకున్న ప్రేమను చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. నువ్వు లక్షలాది మందికి శక్తికి మరియు స్ఫూర్తికి నిలయంగా మారావు. నువ్వు నన్ను నీ ‘హీరో’ అని పిలుస్తావు, కానీ నీ దృఢ సంకల్పం, నిజాయితీ మరియు నిస్వార్థ ప్రయాణం నన్ను కూడా ఎన్నో విధాలుగా ప్రభావితం చేశాయి. జ్ఞాపకాల రూపంలో ఈ అందమైన కానుకను అందించినందుకు ధన్యవాదాలు కళ్యాణ్ బాబూ. నీ ప్రేమే నా జీవితంలో లభించిన గొప్ప వరాలలో ఒకటి. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను” అంటూ ట్వీట్ చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ హీరో మాములోడు కాదు.. నెంబర్ వన్ ఫ్రాడ్.. సీనియర్ నటుడు సురేష్..

పవన్ కళ్యాణ్ ట్వీట్.. 

చిరంజీవి ట్వీట్..

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బిగ్‏బాస్‏లోకి ఈశ్వర సాయి, మాధురి రాథోడ్.. ఆది రెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ?