Reading Time: 2 minutes

ఓడినా వణికించారు.. బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్ షిప్ సెమీస్‎లో ట్రీసా, గాయత్రి జోడీ ఓటమి

Caption of Image.

న్యూఢిల్లీ: బీడబ్ల్యూఎఫ్ (BWF) వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ 2026లో భారత స్టార్ జోడీ గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నారు. శనివారం (ఆగస్ట్ 222) జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో ప్రపంచ నంబర్ 1 చైనీస్ ద్వయం లీయూ షెంగ్ షూ – టాన్ నింగ్‌ చేతితో 21-18,  21-13, 21-8 తేడాతో ఓటమి పాలయ్యారు. మ్యాచ్ ఓడినప్పటికీ వీరోచిత పోరాటంతో ప్రపంచ నెంబర్ జోడీని భారత ద్వయం వణికించింది. 

సెమీస్‎లో ఓటమితో గాయత్రి-ట్రీసా జోడీ బ్రాంజ్ మెడల్‎తో టోర్నీని ముగించింది. ఈ మెడల్‎తో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ మహిళల డబుల్స్‌ విభాగంలో భారత 15 ఏళ్ల పతక నిరీక్షణకు తెరపడింది. 2011లో జ్వాలా గుత్తా- అశ్విని పొన్నప్ప జోడీ మాత్రమే ఈ విభాగంలో  భారత్‌ కాంస్యం సాధించింది. 15 ఏళ్ల తర్వాత  గాయత్రి-ట్రీసా జోడీ కూడా కాంస్య పతకమే గెలవడం విశేషం. 

న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఈ సెమీ ఫైనల్ పోరు హోరీగా సాగింది. 1 గంటా 11 నిమిషాల పాటు సాగిన ఈ సుదీర్ఘ పోరాటంలో ఓడినప్పటికీ భారత జోడీ ప్రపంచ నంబర్ 1 చైనీస్ ద్వయాన్ని వణికించింది. అద్భుతమైన ఆటతో గేమ్ మొదలుపెట్టిన గాయత్రి-త్రీసా జోడీ మొదటి గేమ్‌ను 21-18తో గెలుచుకుని ప్రపంచ నంబర్ 1 జంటకు ఊహించని షాకిచ్చింది.

తొలి సెట్ ఓటమి నుంచి వెంటనే తేరుకున్న చైనీస్ జోడీ రెండో సెట్‎లో తమ వ్యూహాలను మార్చి సూపర్ కంబ్యాక్ ఇచ్చింది. 21-13 తేడాతో గాయత్రి-త్రీసా జోడీని ఓడించి రెండో సెట్‎ను దక్కించుకుంది. ఇరు జట్లు చెరో సెట్ గెలవడంతో మ్యా్చ్ మూడో సెట్‎కు దారి తీసింది. నిర్ణయాత్మక ఫైనల్ రౌండ్‎లో ప్రపంచ నంబర్ 1 జంట తమ అనుభవాన్ని ఉపయోగించి 21-8తో కైవసం చేసుకుని మ్యాచ్‌ను ముగించారు. 

దీంతో భారత జోడీ కాంస్యంతో సరిపెట్టుకోగా.. చైనీస్ జంట ఫైనల్‎కు దూసుకెళ్లింది. ఈ వరల్డ్ కప్‎లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. క్వార్టర్ ఫైనల్లో చైనాకే చెందిన 4వ సీడ్ జోడీని ఓడించి సెమీస్‌కు చేరిన ఈ యంగ్ జోడీ, భవిష్యత్ భారత బ్యాడ్మింటన్‌కు ఆశాకిరణంగా నిలిచింది.

©️ VIL Media Pvt Ltd.