Reading Time: < 1 minute
Ap Government Jobs 2026 10060 Posts Approved In Job Calendar

AP Job Calendar 2026: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది రాష్ట్రంలోని కూటమి సర్కార్.. 2026 జాబ్ క్యాలెండర్‌లో భాగంగా మొత్తం 10,060 ప్రభుత్వ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ఉద్యోగాలను నాలుగు దశల్లో భర్తీ చేయనున్నారు. ఇప్పటికే తొలి దశలో 1,523 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. రెండో దశలో భాగంగా సెప్టెంబర్ 15న 3,231 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇందులో గ్రూప్-1 కేటగిరీలో 149 పోస్టులు ఉన్నాయి. అలాగే పోలీస్ శాఖలో 542 కానిస్టేబుల్ పోస్టులు, 182 సివిల్ ఎస్‌ఐ పోస్టులను ఈ దశలో భర్తీ చేయనున్నారు.

ఆ తర్వాత అక్టోబర్ 15న మూడో దశలో 2,311 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో గ్రూప్-2లో 673 పోస్టులు ఉన్నాయి. అలాగే డిప్యూటీ తహసీల్దార్ పోస్టులకు సంబంధించి 200 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్‌తో పాటు ఇతర విభాగాల్లో మరో 1,638 పోస్టులు ఈ దశలో ఉన్నాయి. ఇక అక్టోబర్ 15న నాలుగో దశలో 2,995 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో అత్యధికంగా స్కూల్ ఎడ్యుకేషన్ శాఖలోనే 2,991 పోస్టులు ఉన్నాయి. దీంతో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కూడా భారీగా అవకాశాలు లభించనున్నాయి.

మొత్తంగా 2026 జాబ్ క్యాలెండర్‌లో నాలుగు దశల్లో 10,060 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే తొలి దశ ప్రక్రియ ప్రారంభం కాగా, సెప్టెంబర్ 15 నుంచి రెండో దశ, అక్టోబర్ 15 నుంచి మూడో, నాలుగో దశల నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వేలాది మంది అభ్యర్థుల్లో ఆశలు పెరిగాయి.