Reading Time: 2 minutes

కూతురు కాపురంలో నిప్పులు పోస్తున్న పేరెంట్స్.. రూ.60 లక్షలు సంపాదించే అల్లుడిని ఘోరంగా కొట్టి చంపేశారు!

Caption of Image.

కొన్ని ఘటనలు చూస్తుంటే ఈ మాట అనాల్సి వస్తుంది. కూతురు కాపురంలో నిప్పులు పోస్తున్న పేరెంట్స్ అని.. కూతురు కాపురంలో కుంపటి పెట్టిన తల్లిదండ్రలు, అన్నతమ్ములు అని. ఎందుకంటే భార్య భర్తల మధ్య ఓ రోజు గడిస్తే సద్దుమణిగే చిన్న చిన్న వాదనలను పెంచి పెద్దది చేసి వాళ్ల విడాకులకు లేక మరణాలకు కారణం అవుతున్న పేరెంట్స్ ఎందరో ఉన్నారు. ఢిల్లీలో జరిగిన ఈ ఇన్సిడెంట్ కూడా భార్యభర్తల మధ్యలోకి భార్య పేరెంట్స్, సోదరులు ఎంటరై చివరికి 60 లక్షల రూపాయలు సంపాదించే అల్లుడిని పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 

ఢిల్లీకి చెందిన వినయ్ గుప్తా (31) సాఫ్ట్ వేర్ ఇంజినీర్. మూడున్నరేళ్ల కిందట రేఖను వివాహం చేసుకున్నాడు. ఇద్దరికీ ఒక బాబు,  పాప. నోయిడాలో ఉన్న అడోబ్ ఇండియా కంపెనీలో 60 లక్షల రూపాయల ప్యాకేజీకి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. 

పిల్లల మెడిసిన్ విషయంలో గొడవ..

వినయ్ తల్లి చెప్పిన వివరాల ప్రకారం.. పిల్లలకు ఇచ్చే మెడిసిన్ విషయంలో భార్యభార్తలకు గొడవ జరిగింది. వినయ్ గట్టిగా చెప్పడంతో రేఖ సీరియస్ అయిపోయి.. ఆ తర్వాత జరిగిన వాదనతో ఇంట్లోనుంచి వెళ్లిపోయింది. పది నిమిషాల్లో వాళ్ల కుటుంబ సభ్యులను తీసుకుని వచ్చింది. రేఖ తండ్రి, ఇద్దరు సోదరులు, ఆమె వదిన, మామ, మరో వ్యక్తితో వచ్చి ఇంట్లో దాడి చేసినట్లు చెప్పారు. 

ఇంట్లో ఏం జరిగింది ..

రేఖ కుటుంబ సభ్యులు రావడంతో.. వాళ్లకు నీళ్లు తెచ్చేందుకు వినయ్ తల్లి లోపలికి వెళ్లింది. వినయ్ కూడా వాటర్ ఇచ్చి మర్యాదగానే మాట్లాడాడు. కానీ వాళ్లు దాడి చేయడం ప్రారంభించారు. 
వినయ్ ని ఇష్టం వచ్చినట్లు చితకొట్టినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కొట్టి ఛాతిపై నిలబడి చంపేస్తామంటూ రచ్చరచ్చ చేశారని తెలిపారు. ఛాతిపైన చేతులు పెట్టి, కాళ్లు పెట్టి నిలబడి.. దారుణంగా కొట్టారని.. విడిపించే ప్రయత్నం చేసినా తమ వల్ల కాలేదని చెబుతున్నారు. 

ప్రీ ప్లాన్డ్ మర్డర్:

ఇదంతా ప్రీప్లాన్డ్ మర్డర్ అని వినయ్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన కుటుంబ సభ్యులు రాగానే రేఖ సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేసినట్లు వినయ్ తల్లి చెప్పారు. రేఖ ఎర్ర డ్రెస్సు, ఆమె వదిన బ్లూ సూట్ వేసుకుని ఇంట్లోకి ఎంటరవడం..  రేఖ ఆమె ఇద్దరు అన్నదమ్ములు, ఆమె తండ్రి బయట కార్ దగ్గర ఉన్న ఫూటేజ్ వరకే రికార్డయిందని చెప్పారు. అంటే దాడి చేయాలని ముందే డిసైడయ్యారని.. అందుకే రేఖ సీసీ కెమెరాలు ఆపేసినట్లు వినయ్ తల్లి ఆరోపించారు.

ఇరుగు పొరుగు సాయం..

ఈ గొడవ జరిగినప్పుడు ఇరుగు పొరుగు వారు ఏదో చిన్న గొడవ ఉండొచ్చులే అనుకున్నట్లుతెలిపారు. కానీ వినయ్ నడవలేకుండా వేలాడుతుంటే.. భుజాలపై మోసుకొస్తున్న దృశ్యం చూసి చలించి అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు చెప్పారు. కానీ ఆసుపత్రికి వెళ్లే సరికి.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించడం ఆ పేరెంట్స్ జీర్ణించుకోలేని విషయం. 

వేరు పడిన కొడుకు ఫ్యామిలీ:

వినయ్, అతనిభార్య తమతో వేరుపడినట్లు వినయ్ పేరెంట్స్ తెలిపారు. వేర్వేరుగా వంట చేసుకుంటున్నామనిచెప్పారు. ఎప్పుడూ వాదనలకు దిగుతున్న కోడలితో ఎందుకు వచ్చిందిలే.. వాళ్లైనా ప్రశాంతంగా ఉండనీ అని వాళ్లకు మూడో ఫ్లోర్ కేటాయించినట్లు చెప్పారు. 

రేఖ చీటికి మాటికి వినయ్ తో గొడవలకు, వాదనలకు దిగేదని చెబుతున్నారు. అంతకు ముందు వినయ్ ని చంపేస్తానని రేఖ సోదరుడువార్నింగ్ ఇచ్చినట్లు వినయ్ తల్లి పేర్కొంది. 

చాలా రోజులుగా భార్యా భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయని.. వాళ్లే సర్దుకుంటారులే.. వాళ్లే సెటిల్ చేసుకుంటారులే అని వాళ్ల మధ్య తలదూర్చలేదని వినయ్ తండ్రి చెప్పాడు. రేఖ, ఆమె కుటుంబ సభ్యులు ఆరు మంది తమ కొడుకును చంపేసినట్లు వినయ్ ఫ్యామిలీ ఆరోపిస్తోంది. 

వినయ్ భార్య రేఖతో సహా నిందితులను పోలీసులుఅరెస్టు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎవిడెన్స్ ను సేకరించారు. దర్యాప్తు తర్వాత ఎవరి పాత్ర ఏంటనేది తేల్చనున్నట్లు చెప్పారు. 

పేరెంట్సే కూతురు కాపురంలో నిప్పులు పోస్తున్నారా..?

ఈ ఘటన గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అంత సంపాదన ఉన్న వ్యక్తిని ఎలా చంపాలనిపించిందని కామెంట్స్ పెడుతున్నారు. ఒకవేళ ఇష్టం లేకుంటే విడాకులు తీసుకుంటే సరిపోయేదని.. చంపడమెందుకని వాదిస్తున్నారు. 

భార్య భర్తలు అన్నాక చిన్న చిన్న వాదనలు, గొడవలు సహజం. కూతురు చెప్పే ప్రతి విషయానికి రెస్పాండ్ అయ్యి.. తల దూర్చి.. అల్లుడిని బెదిరింపులకు గురిచేస్తే.. దాన్ని కూతురు అలుసుగా తీసుకుని మరింత చేస్తుందని కొందరు అంటున్నారు. అలా కాకుండా వాళ్లే గొడవలు పడతారు వాళ్లే మంచిగ అవుతారు.. నీ కాపురం కూలిపోకుండా చూసుకోమ్మా.. చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూసి లైఫ్ రిస్కులో పెట్టుకోవద్దమ్మా..?అని చెప్పాల్సింది పోయి.. ప్రతి దానికి రెచ్చిపోయి.. వన్ సైడ్ వాదననే వింటే ఇలాగే ఉంటుందని అంటున్నారు. 

కుటుంబం మొత్తం ఇన్వాల్వ్ అయ్యి హత్య చేశారంటే దీని వెనుక ఏముందో ఎవరికి తెలుసు అని మరికొందరు అంటున్నారు. దర్యాప్తు చేస్తే గాని అసలునిజం బయటపడదు అని చెబుతున్నారు. ఏ విషయం అనేది పోలీసుల దర్యాప్తు రిపోర్టుతర్వాత తెలుస్తుంది. 

©️ VIL Media Pvt Ltd.