Reading Time: < 1 minute
Kiran Abbavarams Blockbuster Has Arrived On Digital Streaming

 కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా, శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ లవ్ డ్రామా ‘చెన్నై లవ్ స్టోరీ’. దర్శకుడు రవి నంబురి తెరకెక్కించిన ఈ భావోద్వేగ ప్రేమ కథా చిత్రానికి, ప్రముఖ దర్శకుడు మరియు రచయిత సాయి రాజేష్ కథ అందించడంతో పాటు నిర్మాతగాను వ్యవహరించడం విశేషం. గతనెల 24న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఊహించని రీతిలో భారీ విజయాన్ని అందుకుంది.

చిత్రంలో హీరో, హీరోయిన్ల మధ్య ఉన్న కెమిస్ట్రీతో పాటు సాయి రాజేష్ అందించిన కథ, భావోద్వేగాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో అద్భుతమైన వసూళ్లను సాధించి, కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. థియేటర్లలో విజయవంతమైన రన్ పూర్తి చేసుకున్న ఈ ప్రేమకథ, ఇప్పుడు డిజిటల్ ప్రియులను అలరించేందుకు ఫైనల్‌గా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ ఈ సినిమాను నేటి నుండి స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిస్ అయిన వీక్షకులు, మళ్లీ చూడాలనుకునే లవర్స్ ఇప్పుడు ఈ డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా ఈ సూపర్‌హిట్ చిత్రాన్ని వీక్షించవచ్చు.