Reading Time: < 1 minute
Rahul Gandhi Pellet Gun Protest Delhi Police Fir

Rahul Gandhi: కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఢిల్లీలో శుక్రవారం మెరుపు ధర్నాకు దిగారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), యువత నిరసనల సమయంలో పెల్లెట్ గన్ కాల్పుల్లో గాయపడిని విద్యార్థి సాహిల్ లోచాబ్‌కు సంబంధించిన కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. సాహిల్, అతడి తల్లితో కలిసి పార్లమెంట్ స్ట్రీట్ లోని డీసీపీ కార్యాలయానికి వెళ్లిన రాహుల్ గాంధీ, పోలీసులతో చర్చల తర్వాత అక్కడే ధర్నాకు దిగారు.

పెల్లెట్ గన్ ఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని, దర్యాప్తు అధికారి వివరాలు కూడా పోలీసులు ఇవ్వడం లేదని రాహుల్ ఆరోపించారు. ఇది క్రిమినల్ కేసు అయినప్పటికీ కేసు నమోదు చేయడం అన్యాయమని ఆయన అన్నారు. రాహుల్ ధర్నా విషయం తెలుసుకున్న ప్రియాంకా గాంధీ, జైరామ్ రమేష్, రణదీప్ సుర్జేవాలా, సుప్రియా శ్రీనేత తదితరులు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని నిరసన చేపట్టారు. పోలీస్ స్టేషన్ ముందు కాంగ్రెస్ కార్యకర్తలు భజనలు, దేశభక్తి గీతాలు పాడుతూ నిరసన తెలిపారు.

పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈ ఘటనలో సాహిత్ తీవ్రంగా గాయపడ్డారని, కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. అతడి శరీరంలో, కంటిలో పెల్లెట్లు ఉన్నాయని, గుండె సమీపంలో కూడా తొలగించలేని పెల్లెట్లు ఉన్నాయని చెప్పారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి న్యాయపరమైన దర్యాప్తు జరపాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు తాము పోలీస్ స్టేషన్ ముందు నుంచి కదిలేదని లేదని చెప్పారు. అయితే జంతర్ మంతర్ నిరసనలకు సంబంధించి ఇప్పటికే ఫిర్యాదు అందిందని, ఆ నిరసనల సమయంలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అంతేకాకుండా, తాము పెల్లెట్ గన్‌తో కాల్పులు జరపలేదని స్పష్టం చేశారు.