Reading Time: 2 minutes

అధికారంలో  ఉన్నవారినీ వదలకండి..తప్పు చేస్తే బరాబర్ ప్రశ్నించండి : డిప్యూటీ సీఎం భట్టి

Caption of Image.
  • జర్నలిస్టులు వృత్తి ప్రమాణాలను వదిలిపెట్టొద్దు 
  • పాలకులను నిలదీసే పత్రికా స్వేచ్ఛను స్వాగతిస్తం
  • జర్నలిజం వ్యాపారం కాదు..  అదొక సామాజిక బాధ్యత
  • హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లాంఛనంగా ‘ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్’ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: ‘తప్పు చేస్తే ఎంతటి వారినైనా ప్రశ్నించండి.. అధికారంలో ఉన్నవారిని కూడా వదలకండి..’ అని జర్నలిస్టులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. జర్నలిస్టులు వృత్తి ప్రమాణాలను వదిలిపెట్టవద్దని.. పాలకులను నిలదీసే పత్రికా స్వేచ్ఛను తాము స్వాగతిస్తామని పేర్కొన్నారు. జర్నలిజం వ్యాపారం కాదు.. అదొక సామాజిక బాధ్యత అని అన్నారు. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రెస్ క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ప్రతినిధులు ఏకతాటిపైకి వచ్చి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన ‘ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్’ను శనివారం ఆయన ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో హిందూ పత్రిక మాజీ ఎడిటర్ ఎన్ రామ్, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సంగీత బారోచ్, కరవన్ పత్రిక ఎడిటర్ అనంతనాథ్, ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్ నుంచి గౌతమ్ లాహిరి, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ విజయ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  ఈ  సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం మనుగడకు పాలకులను ప్రశ్నించే పత్రికా స్వేచ్ఛ అత్యంత కీలకమని చెప్పారు.

విమర్శలను స్వీకరించే ధైర్యం ప్రభుత్వాలకు ఉండాలని, ​వివక్షను ప్రశ్నించాల్సిన బాధ్యత పత్రికలదేనని చెప్పారు. ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హల్ద్వానీలోని రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లీలా మైదానంలో ప్రసంగించిన రెండు రోజుల తర్వాత, కొందరు అక్కడ ‘శుద్ధీకరణ’ కార్యక్రమం నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టారు.  

ఎనిమిది దశాబ్దాల స్వాతంత్ర్యం తర్వాత కూడా ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడి పట్ల బహిరంగంగా ఇలా వ్యవహరిస్తే.. దేశంలో సమానత్వం, గౌరవం ఏ స్థాయిలో ఉన్నాయో ప్రశ్నించాల్సిన అవసరం అందరికీ ఉందన్నారు.  ఒకప్పుడు పత్రికా సంపాదకుడి పదవికి దేశంలో రెండో అత్యంత ముఖ్యమైన స్థానం ఉండేదని, రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్ గోయెంకా లాంటి యజమానులు ప్రభుత్వాలను సైతం సవాలు చేసేవారని ఆయన గుర్తుచేశారు. ​ 

విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాం

2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యానికి అనుగుణంగా విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్రంలో విద్యుత్, నీటి కొరత లేకుండా పారిశ్రామిక రంగానికి అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. శనివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వేదికగా ఎస్పీడీసీఎల్ నిర్వహిస్తున్న మూడు రోజుల ‘పవర్ ఎగ్జిబిషన్–2026’ను డిప్యూటీ సీఎం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు రాష్ట్రంలో మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీస్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. భవిష్యత్ విద్యుత్ అవసరాలను ముందుగానే అంచనా వేసి థర్మల్, సోలార్, హైడల్, పంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ స్టోరేజ్, బ్యాటరీ స్టోరేజ్ వంటి అన్ని రంగాల్లో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా సామర్థ్యాలను పెంచేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.

విద్యుత్ శాఖ సాధిస్తున్న విజయాలు, తీసుకొస్తున్న సంస్కరణలు, ఆధునిక సాంకేతికతపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి విద్యుత్ శాఖ ఉద్యోగులు అందిస్తున్న సేవలు ఎంతో కీలకమని ప్రశంసించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగినప్పటికీ, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్, ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, ఇతర డైరెక్టర్లు మరియు అధికారులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.