
కోల్‌బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను మంచిర్యాల కార్పొరేషన్‌కు చెందిన మరో నలుగురు కార్పొరేటర్లు, పలువురు లీడర్లు కాంగ్రెస్ లీడర్ మంతెన జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో కలిశారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 5, 6, 8వ వార్డుల కార్పొరేటర్లుతోటపల్లి రాజేశ్వరి, వనపర్తి కేతా రాజేశ్, మేకల రమేశ్, 48వ వార్డు కార్పొరేటర్వేములపల్లి లక్ష్మీదుర్గ కొడుకు మాజీ కౌన్సిలర్సంజీవ్, మార్కెటింగ్కమిటీ డైరెక్టర్ ఇర్ఫాన్‌తో పాటు వివిధ డివిజన్లకు చెందిన లీడర్లు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్లో శుక్రవారం మంత్రి, ఎంపీని మర్యాపూర్వకంగా కలిశారు. గురువారం సైతం ముగ్గురు మంచిర్యాల కార్పొరేటర్లు, లక్షేట్టిపేట మున్సిపల్ కౌన్సిలర్లు, దండేపల్లి సర్పంచి, ఉప సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, లీడర్లు కలిసిన మంత్రి వివేక్, ఎంపీ వంశీని కలిసిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రావుల ఉప్పలయ్య, మాజీ కౌన్సిలర్అగల్డ్యూటీ రాజు తదితరులు పాల్గొన్నారు.