
- అరెస్ట్ వారెంట్‌తో నిజామాబాద్
- సెంట్రల్ జైల్లో ఉన్న లకావత్ రాజు
నిజామాబాద్, వెలుగు: పారిపోయే ప్రయత్నంలో హాస్పిటల్ సెకండ్ ఫ్లోర్ నుంచి దూకడంతో ఓ ఖైదీకి తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమించి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. మెదక్ జిల్లా చేగుంటకు చెందిన లకావత్‌రాజుపై కామారెడ్డి జిల్లా భిక్కనూర్ పోలీస్‌స్టేషన్‌లో 2024లో ఓ కేసు నమోదు కాగా, రిమాండ్‌కు వెళ్లి బెయిల్‌పై రిలీజ్ అయ్యాడు. ఆ తరువాత కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి వారెంట్ జారీ చేశారు. దీంతో నాలుగు రోజుల కింద అతడిని అరెస్ట్ చేసి నిజామాబాద్ సెంట్రల్ జైలుకు తరలించారు. శనివారం హెల్త్ చెకప్ కోసం జీజీహెచ్‌కు తీసుకురాగా, పోలీస్ ఎస్కార్ట్ మధ్య సెకెండ్ ఫ్లోర్ నుంచి కిందకు దూకేశాడు. తల, ఛాతీ భాగంలో తీవ్రగాయాలైన రాజు ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో ట్రీట్‌మెంట్ పొందుతున్నాడు. అతడి పరిస్థితి క్రిటికల్‌గా ఉందని డాక్టర్లు తెలిపారు.