
Hockey World Cup: యామ్‌స్టెల్‌వీన్‌లోని వాగ్నర్ హాకీ స్టేడియంలో జరిగిన పురుషుల హాకీ ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత హాకీ జట్టు 1-3 తేడాతో వరల్డ్ నంబర్-1 నెదర్లాండ్స్ చేతిలో ఓటమి పాలైంది. ఈ విజయం ద్వారా నెదర్లాండ్స్ సెమీఫైనల్‌కు అర్హత సాధించగా, భారత జట్టు సెమీఫైనల్ రేసు క్లిష్టంగా మారింది.
ఇప్పుడు, భారత్ ఆగస్టు 24న అర్జెంటీనాతో జరిగే మ్యాచ్‌లో ఆరు గోల్స్‌కు పైగా తేడాతో గెలవాలి. 53వ నిమిషంలో వాన్ డామ్ స్కోరును 3-1కి పెంచాడు. 51వ నిమిషంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మార్చాడు. 41వ నిమిషంలో డూకో టెల్జెన్‌క్యాంప్ మొదటి గోల్ చేసిన తర్వాత, 49వ నిమిషంలో హెడెమేకర్స్ ఫీల్డ్ గోల్‌తో ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు.
భారత్ సెమీఫైనల్ చేరాలంటే:
ఆగస్టు 24న జరగబోయే మ్యాచ్‌లో భారత్, అర్జెంటీనాపై కనీసం 6 కంటే ఎక్కువ గోల్స్ తేడాతో భారీ విజయం సాధించాలి. అదే సమయంలో ఇంగ్లాండ్ జట్టు తన తర్వాతి రెండు మ్యాచ్‌లలోనూ ఓడిపోవాల్సి ఉంటుంది. తొలి అర్ధభాగంలో నెదర్లాండ్స్ పెనాల్టీ కార్నర్‌లను సంపాదించగా, భారత జట్టు ఫీల్డ్ గోల్ అవకాశాలను సృష్టించుకుంది. అయితే, ఏ జట్టు కూడా గోల్ చేయలేకపోయింది. క్రికెట్ దిగ్గజాలైన స్టీవ్ వా, రాహుల్ ద్రావిడ్, హాకీ దిగ్గజాలైన జేమీ డ్వైర్, ట్యూన్ డి నూయెర్ మ్యాచ్ వీక్షించడానికి హాజరయ్యారు.
మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి