Reading Time: < 1 minute

KPHB హాస్టళ్లపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు…

Caption of Image.

హైదరాబాద్ లో ఒకప్పుడు హాస్టల్స్ అంటే.. అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, అశోక్ నగర్, దిల్షుక్ నగర్ లాంటి కొన్ని ఏరియాలకే పరిమితంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది… KPHB, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి లాంటి ఏరియాల్లో కూడా హాస్టల్స్ పెరిగిపోయాయి. ఒకానొక సమయంలో హాస్టల్స్ వల్ల ఉండలేకపోతున్నామంటూ KPHB వాసులు పోలీసులకు కంప్లైంట్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి.

ఈ క్రమంలో KPHBలో హాస్టళ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు పోలీసులు. గురువారం ( ఆగస్టు 20 ) కేపీహెచ్ బీలోని రోడ్ నంబర్ 2, 3లో హాస్టళ్లలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించి హాస్టల్ నిర్వాహకులు, యువతకు సైబర్ నేరాలు, గంజాయి, డ్రగ్స్, పై అవగాహన కల్పించారు.

ఎలాంటి అనుమానాస్పద లింకులు, ఫోన్‌ కాల్స్‌కు స్పందించవద్దని…సైబర్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీసులు. యువత మత్తు పదార్థాలకుపూర్తిగా దూరంగా ఉండాలని ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా
వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

©️ VIL Media Pvt Ltd.