Reading Time: < 1 minute
Deepika Padukone Demanded 10 Percent Profit Share Rejected Pranay Reddy Vanga Interview

సందీప్ రెడ్డి వంగ చిత్రాల ప్రొడక్షన్ విషయాలపై ఆయన సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ ఎన్టీవీ పాడ్‌కాస్ట్ షోలో మరో ఆసక్తికరమైన నిజాన్ని బయటపెట్టారు. గతంలో హీరోయిన్ ఎంపిక ప్రక్రియలో బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొనేతో చర్చలు జరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ సినిమా అనుకున్నప్పుడు ముందుగా సందీప్ రెడ్డి దీపికనే ఎంచుకున్నారని ఆమె టాలెంట్ మీద నమ్మకంతోనే ఆమెను ఎంపిక చేసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. సుమారు ఏడాదిన్నర పాటు వారు కథ గురించి ట్రావెల్ చేశారని ఆ సమయంలోనే ఆమెకు రెండు భారీ బ్లాక్ బస్టర్ హిట్లు పడడంతో ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోనే దీపికా పదుకొనే సినిమా నెట్ ఇన్‌కమ్/లాభాల్లో ఏకంగా 10 శాతం వాటా (షేర్) ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెమ్యునరేషన్ వాటాతో పాటు షూటింగ్ డేట్స్, కాల్షీట్ టైమింగ్స్ విషయంలోనూ ఆమె ఏమాత్రం రాజీపడలేదు. పోనీ అలా డిమాండ్ చేసినా మాకు పెద్దగా ఇబ్బంది అనిపించేది కాదు కానీ ప్రాజెక్టులో ఆమె భాగమైనప్పుడు ఆమెకు కొన్ని కీలకమైన విషయాలు సందీప్ రెడ్డి వెల్లడించాడు ఆ విషయాలను ఆమె కావాలని లీక్ చేయించినట్లు ప్రణయ్ రెడ్డి చెప్పుకొచ్చాడు. ఈ తరహా ప్రవర్తన కారణంగా సినిమా గురించి సందీప్ రెడ్డి చేసుకున్న ప్లాన్స్ అన్ని పూర్తిగా తారుమారవుతాయని భావించి, నిర్మాతలుగా తాము ఆమెను పక్కన పెట్టాల్సి వచ్చిందని ప్రణయ్ వివరించారు. ఆ తర్వాతే కథానాయిక పాత్ర కోసం ఇతర ప్రత్యామ్నాయాల వైపు చూశామని స్పష్టం చేశారు.