Reading Time: < 1 minute
Toxic Movie Pre Release Event Accident Sound Box Collapses Students Injured

పాన్-ఇండియా స్టార్ యష్ కథానాయకుడిగా వస్తున్న భారీ చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ .  మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో జెట్ స్పీడ్ లో చేస్తున్నాడు యష్. మేడ్చల్ జిల్లాలోని మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో శనివారం రాత్రి ఈ ఈవెంట్‌ను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యశ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు వేలాది మంది విద్యార్థులు, అభిమానులు భారీగా తరలివచ్చారు.

దాంతో ప్రీ-రిలీజ్ వేడుకలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. కార్యక్రమం జరుగుతుండగా, హీరో యశ్‌ను చూసేందుకు కొందరు ఉత్సాహంతో వేదిక సమీపంలో అమర్చిన భారీ సౌండ్ బాక్స్‌లు, ఫ్లడ్ లైట్ నిర్మాణాలపైకి ఎక్కారు. విద్యార్థుల బరువును తట్టుకోలేక ఆ సౌండ్ సిస్టమ్ అమర్చిన ఫ్రేమ్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థుల కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు వేగంగా స్పందించి, గాయపడిన విద్యార్థులను అంబులెన్స్‌లలో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితులకు ప్రస్తుతం అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రాంగణంలో భద్రతా చర్యలు సరిగా లేకపోవడం, విద్యార్థులు పరిమితికి మించి సౌండ్ బాక్సులపైకి ఎక్కడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదం జరగడంతో హీరో యష్ తన స్పీచ్ ను ఆపేసి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించమని సూచించారు.