Reading Time: < 1 minute

ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ ..నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో లబ్ధిదారులతో మీటింగ్

Caption of Image.

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ ను ఎమ్మెల్యే కూచుకుల రాజేశ్​రెడ్డి పంపిణీ చేశారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో లబ్ధిదారులతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి పొందవచ్చన్నారు. ఇండ్ల పనులు వేగంగా జరిగేలా అధికారులు, ప్రజాప్రతినిధులు  పని చేయాలని కోరారు. 

©️ VIL Media Pvt Ltd.