
బుల్లితెర రియాలిటీ షో ‘ది ట్రెయిటర్స్ సీజన్ 2’ లో గేమ్ కంటే గ్లామర్, గాసిప్, గొడవలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీ మల్లికా షెరావత్ ఎక్కడ ఉంటే అక్కడ కాంట్రవర్సీకి కొదవ లేకుండా పోతోంది. సిక్త్ ఎపిసోడ్ బిలియర్డ్స్ రూమ్‌లో శ్వేతా తివారీ, రియా చక్రవర్తిలతో మాట్లాడుతూ మల్లికా చెప్పిన మాటలు నెటిజన్లకు అస్సలు మింగుడుపడటం లేదు. మల్లికా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దూమారమే రేపుతున్నాయి.
ఈ షోలో శ్వేతా తివారీకి మ్యాచ్ మేకింగ్ చేయడానికి మల్లికా తెగ ట్రై చేసింది. ‘నీ కోసం ఒక హ్యాండ్సమ్ యురోపియన్ కుర్రాడిని వెతికి పట్టుకుంటా.. నిన్ను దేవతలా చూసుకుంటాడు’ అని అంటుంది. దీనిపై రియా ఎంట్రీ ఇస్తూ ఏంటి మల్లికా.. ఇండియన్ మెన్ కంటే యురోపియన్ పురుషులే డేటింగ్ కి బెస్ట్ అంటావా? అని బాంబ్ పేల్చింది. దానికి మల్లికా ఏమాత్రం తగ్గకుండా, ఓ మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ … అదొక ప్రశ్నేనా? నీకేమైనా మైండ్ పోయిందా? అంటూ ఇండియన్ మెన్ కంటే యురోపియన్‌లే తోప్ అని ఇన్ డైరెక్ట్‌గా సెటైర్ వేసింది. శ్వేత మాత్రం నవ్వుతూ నా వెనకాల ఎందుకు పడ్డావ్? అంటూ సింపుల్‌గా తేల్చేసింది.
ఈ వీడియో కాస్త బయటకు రావడంతో నెటిజన్లు మల్లికాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ‘డేటింగ్ సర్వే ఏమైనా చేశావా?’ అని ఒకరంటే, మంచి, చెడు మనుషులు ప్రతిచోటా ఉంటారు.. అంత సీన్ లేదు అని మరికొందరు కౌంటర్లు ఇస్తున్నారు. మధ్యలో షాలిని పాస్సీ జోక్యం చేసుకుని మగాళ్ల గోల పక్కనబెట్టి గేమ్ మీద ఫోకస్ చేయండి అని క్లాస్ పీకడంతో ఈ రచ్చ మరింత హైలైట్ అయింది.
మరోవైపు శ్వేతా తివారీ మొదటి ఎపిసోడ్‌లోనే ‘నా భర్తలు చీటింగ్ చేస్తూ దొరికిపోయారు’ అని చెప్పిన సంచలన వ్యాఖ్యల వేడి చల్లారకముందే, మల్లికా చేసిన ఈ ఇండియన్ వర్సెస్ యురోపియన్ మెన్ కామెంట్స్ కంటెంట్‌కి కావాల్సినంత మసాలా అందించాయి. ఓవైపు ఆదిత్వ కులశ్రేష్ఠ (కుల్లు), హర్మాన్ సింగ్, రణ్‌వీర్ బ్రార్ వంటి వైల్డ్ ఎలిమినేషన్లతో ట్రెయిటర్స్ షో హీటెక్కుతుంటే, మల్లికా నోటిదురుసు వ్యాఖ్యలు మాత్రం నెట్ ఇంట్లో అగ్గి రాజేస్తున్నాయి. ఈ ‘ది ట్రెయిటర్స్ 2’లో కరణ్ జోహార్ హోస్టింగ్, 21 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లు, ఎత్తులు పైఎత్తులతో సీజన్ మరింత రసవత్తరంగా మారింది.
ALSO READ : బేబీ నక్షత్ర నటనకు ఆడియన్స్ ఫిదా.. ‘ఇరుముడి’లో ఛాన్స్ ఎలా వచ్చిందంటే?