Reading Time: 2 minutes

భారత జట్టులో దక్కని చోటు: కసిగా నెట్స్‌లో సూర్య ప్రాక్టీస్.. SKY వీడియో వైరల్

Caption of Image.

Suryakumar Yadav: భారత్‌కు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని అందించిన సూర్యకుమార్ యాదవ్ (SKY) కెరీర్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత కొంతకాలంగా పేలవమైన ప్రదర్శన కనబరుస్తుండటంతో సెలెక్టర్లు అతనిపై వేటు వేసి, టీమిండియా టీ20 కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను నియమించారు. టీమ్‌లో స్థానం కోల్పోయినప్పటికీ సూర్య మాత్రం ఏమాత్రం నిరాశ చెందకుండా కంబ్యాక్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తాజాగా నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తూ చెమటోడుతున్న వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. మ్యాచ్ కంటే ప్రాక్టీస్‌నే కష్టతరం చేసుకోండి.. నెట్స్‌లోనే మీపై అత్యధిక ఒత్తిడిని పెంచుకుంటే, అసలు మ్యాచ్‌లో ప్రశాంతంగా ఉండటం అలవాటుగా మారిపోతుంది.. కఠిన పరిస్థితులను స్వీకరించండి అంటూ సూర్య ఇచ్చిన క్యాప్షన్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

అండర్‌టేకర్ లాగా గాయబ్ అయిపో భాయ్: 

సూర్య కుమార్ యాదవ్ పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఫామ్ లేమితో బాధపడుతున్నందున అంతర్జాతీయ క్రికెట్‌లో అతనికి ఇక అవకాశాలు ముగిసినట్లేనని, ఈ విషయాన్ని సూర్య అంగీకరించాలని కొందరు నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఒక ఫ్యాన్ స్పందిస్తూ.. @surya_14kumar భాయ్, నువ్వు WWE స్టార్ అండర్‌టేకర్ లాగా కొద్ది రోజులు ఎవరికీ కనిపించకుండా గాయబ్ అయిపో.. 2022 నాటి కంటే పవర్‌ఫుల్ వర్షన్‌తో నిన్ను మళ్లీ టీమిండియా జెర్సీలో చూడాలని ఉంది.. ఆల్ ది బెస్ట్ అని రాసుకొచ్చాడు. మరో నెటిజన్ GHEE ఖతమ్ భౌ (సత్తా అయిపోయింది) అంటూ సెటైర్ వేశాడు.

ALSO READ : దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. 

మాస్ కంబ్యాక్ ఇస్తాడా? ఫ్యాన్స్ ఈగర్ వెయిటింగ్: 

సోషల్ మీడియాలో ట్రోల్స్ ఒకవైపు నడుస్తున్నా, సూర్యకుమార్ యాదవ్ అభిమానులు మాత్రం అతనికి అండగా నిలుస్తున్నారు. మైదానంలో నాన్‌స్టాప్‌గా సిక్సర్లు బాదే మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ మళ్లీ తన పవర్‌ఫుల్ ఫామ్‌ను అందుకొని జట్టులోకి రీ-ఎంట్రీ ఇస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నెట్స్‌లో సూర్య భాయ్ చూపిస్తున్న ఈ హార్డ్‌వర్క్, డెడికేషన్ చూస్తుంటే, త్వరలోనే భారత జట్టులోకి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చేలానే కనిపిస్తున్నాడు అంటూ నెట్టింట పోస్టులు చేస్తున్నారు.
 

©️ VIL Media Pvt Ltd.