Reading Time: 2 minutes
Astrology: సింహ రాశిలో రవి.. ఇక ఈ రాశుల వారికి దశ తిరిగినట్టే! రాజయోగాలు ఖాయం..

గ్రహ రాజైన రవి తన స్వస్థానమైన సింహ రాశిలో ప్రవేశించడమనేది కొన్ని రాశులకు ఒక పెద్ద వరం. ఆ రాశుల వారు ఏ రంగంలో ఉన్నా చక్రం తిప్పడం ఖాయంగా జరుగుతుంది. ఆగస్టు 17న సింహ రాశిలో ప్రవేశించిన రవి సెప్టెంబర్ 16 వరకు కొన్ని రాశులకు రాజయోగాలను, రాజ భోగాలను, రాజ వైభవాలను తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా రవి రాశి మార్పు అధికార దాహంతో తపించే మేషం, వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనూ రాశుల వారికి అనేక విధాలుగా శుభ యోగాలను, శుభ ఫలితాలను కలిగించే అవకాశం ఉంది. ఈ రాశుల వారి జీవితాలు సానుకూల మలుపులు తిరగడం జరుగుతుంది.

  1. మేషం: ఈ రాశ్యధిపతి కుజుడికి రవి అత్యంత మిత్రుడు కావడంతో పాటు ఈ రాశికి పంచమ స్థానంలో రవి సంచారం వల్ల ఈ రాశివారికి రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. అత్యంత ప్రముఖులతో, ముఖ్యంగా రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ప్రభుత్వంలో ఉన్న వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు సక్సెస్ అవుతారు. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది.
  2. వృషభం: ఈ రాశికి చతుర్ధాధిపతిగా అత్యంత శుభుడైన రవి చతుర్థ స్థానంలోనే సంచారం చేస్తున్నందువల్ల ఏ రంగంలో ఉన్నా ఈ రాశివారిదే పైచేయిగా ఉంటుంది. అధికార యోగం పడుతుంది. ఉన్నత వర్గాలతో వ్యక్తులతో ఊహించని లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి, వ్యాపార ఒప్పం దాలు కుదిరే అవకాశం ఉంది. విదేశీయానానికి, విదేశాల్లో ఉద్యోగాలకు అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సంపద బాగా వృద్ధి చెందుతుంది.
  3. కర్కాటకం: రవి ఈ రాశికి ధన స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారి దృష్టి ఆదాయ వృద్ది మీదకు మళ్లుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో సహా అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారమవు తాయి. పిత్రార్జితం లభిస్తుంది. ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆర్థిక సమ స్యల నుంచి బయటపడి, లాభాల బాట పడతాయి. ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది.
  4. సింహం: రాశ్యధిపతి రవి ఈ రాశిలో ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు లభిస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద కనక వర్షం కురుస్తుంది. అనేక విధాలుగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది.
  5. వృశ్చికం: రాశ్యధిపతి కుజుడికి మిత్రుడు, ఈ రాశికి దశమాధిపతి అయిన రవి దశమ స్థానంలోనే సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి ఉద్యోగ జీవితంలో కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత పదవి లభించడం, జీతభత్యాలు వృద్ది చెంద డం వంటివి తప్పకుండా జరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లావాదేవీలు, కార్యకలాపాలు ఊపందు కుని, లాభాల పంట పండిస్తాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి.
  6. ధనుస్సు: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన రవి భాగ్య స్థానంలోనే సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా తప్పకుండా దశ తిరిగే అవకాశం ఉంది. ఆదాయం అనేక విధా లుగా వృద్ధి చెందుతుంది. ఆస్తి కలిసి వస్తుంది. అనారోగ్యాల నుంచి ఊహించని ఉపశమనం లభిస్తుంది. విదేశీ ఉద్యోగావకాశాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగ జీవితంలో అంచనాలకు మించిన అభివృద్ధి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది.