
తెలుగు బుల్లితెరపై అత్యంత క్రేజ్ ఉన్న రియాలిటీ షోల్లో ‘బిగ్ బాస్’ ముందు వరుసలో ఉంటుంది. ఇక ఇప్పుడు అందరి చూపు ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’పై పడింది. ఈసారి మేకర్స్ భారీ సర్‌ప్రైజ్‌లతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రమోషనల్ హడావిడి మొదలవ్వడంతో సోషల్ మీడియాలో కంటెస్టెంట్ల పేర్లపై జోరుగా చర్చ జరుగుతోంది.
మరోసారి కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ సీజన్‌కు ‘దశావతారం’ అనే కాన్సెప్ట్‌ను తీసుకొస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తిని మరింత పెంచుతోంది. దశావతారం థీమ్‌కు తగ్గట్టుగా గేమ్‌లో పది రకాల దశలు, కొత్త రూల్స్, మైండ్ గేమ్స్, ఊహించని టాస్కులు ఉండొచ్చని అభిమానులు అంచనా వేస్తున్నారు. అయితే పూర్తి గేమ్ ఫార్మాట్‌పై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.
హాట్ టాపిక్ గా రాంప్రసాద్ పేరు..
ఇదిలా ఉంటే కంటెస్టెంట్ల లిస్ట్‌పై వస్తున్న రూమర్స్‌లో జబర్దస్త్ ఫేమ్ కమెడియన్ రాంప్రసాద్ పేరు ఇప్పుడు వైరల్‌గా మారింది. జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. తన కామెడీ టైమింగ్, ప్రత్యేకమైన యాస, ఫన్‌తో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. బిగ్ బాస్ మేకర్స్ రాంప్రసాద్‌ను సంప్రదించారని, ఆయన షోలో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే హౌస్‌లో కామెడీకి రాంప్రసాద్ కీలకంగా మారే అవకాశం ఉంది.
వైరల్ అవుతున్న కంటెస్టెంట్ల లిస్ట్
రాంప్రసాద్‌తో పాటు టెంపర్ ఫేమ్ వంశీ, యువ నటుడు ఆదిత్య, బుల్లితెర నటి సుహాసిని, యాంకర్ వర్షిణి, సీరత్ కపూర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సౌందర్య, జబర్దస్త్ కమెడియన్ నరేష్ వంటి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అదే సమయంలో సెలబ్రిటీలతో పాటు కామనర్లను కూడా హౌస్‌లోకి తీసుకురావడానికి ‘అగ్ని పరీక్ష 2’ ద్వారా ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. దీంతో ఈసారి హౌస్‌లో సినీ, టీవీ, సోషల్ మీడియా, కామన్ పీపుల్ కలయికతో మరింత వైవిధ్యమైన కంటెస్టెంట్ లైనప్ ఉండే అవకాశం కనిపిస్తోంది.
మొత్తానికి.. ‘దశావతారం’ కాన్సెప్ట్, నాగార్జున హోస్టింగ్, అగ్ని పరీక్ష 2, రాంప్రసాద్ వంటి పేర్లతో ‘బిగ్ బాస్ తెలుగు 10’పై హైప్ ఇప్పటికే పీక్స్‌కు చేరింది. అసలు ఎవరెవరు హౌస్‌లోకి అడుగుపెడతారు? దశావతారం గేమ్ ఎలా ఉండబోతోంది? అన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు సస్పెన్సే. సెప్టెంబర్ తొలి వారంలో సీజన్ 10 ప్రారంభం కానుంది..