
గ్రేటర్ వరంగల్, వెలుగు: మాటలతో కాదు, పనులతోనే సమాధానం చెబుతానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం గ్రేటర్ వరంగల్‌లోని 49వ డివిజన్ లెక్చరర్స్ కాలనీ, సాయి బృందావన్ కాలనీలలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే, బల్దియా కమిషనర్ టి.వెంకన్న హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అభివృద్ధి పనులతోనే ప్రజల ముందుకు వెళ్లి ఓటు అడుగుతామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం బీఎల్ఏలతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ఫేజ్-2పై కాంగ్రెస్ శ్రేణులు అవగాహన, శిక్షణ తీసుకుని, ప్రతి అర్హత కలిగిన ఓటరుకు నష్టం జరగకుండా అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు.