
బాలీవుడ్‌లో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నటి, ఎంపీ కంగనా రనౌత్ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. జాతీయ గేయం ‘వందేమాతరం’పై సీనియర్ నటి షర్మిలా టాగూర్ చేసిన వ్యాఖ్యలపై కంగనా ఓ విరుచుకుపడ్డారు. ఒక నటిగా ఆమె అభిప్రాయల్లో ఇంత సంకుచితంగా, కృత్రిమంగా ఉండటం తనకు షాక్ కలిగించిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరి భామల డిబేట్ నెట్టింట పెద్ద దుమారం రేపుతోంది.
వివాదం ఎక్కడ మొదలైందంటే…
ఈ వివాదం యాదృచ్ఛికంగా రాలేదు. స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత ‘వందేమాతరం’పూర్తి గీతం, మొదటి రెండు చరణాలపై రాజకీయ చర్చకు దారితీసింది.. ఇప్పుడు సినీ నటి షర్మిలా టాగూర్ స్పందించడంతో మరో సారి హాట్ టాపిక్ గా మారింది. ‘వందేమాతరం’లో కాళీ, దుర్గ వంటి దేవతల ప్రస్తావన ఉండే చరణాలు ఉన్నాయని.. ఏకేశ్వరోపాసన పాటించే ఇతర మతస్థులకు వాటిని ఆలపించడం కాస్త ఇబ్బందిగా ఉంటుందని షర్మిలా టాగూర్ అభిప్రాయపడ్డారు. అందుకే దేశంలోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకొనిపోవడానికి మొదటి రెండు చరణాలనే పరిమితం చేయడం సరైనదని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
షర్మిలకు కంగానా కౌంటర్..
ఈ వ్యాఖ్యలపై కంగనా సోషల్ మీడియా వేదికగా గట్టిగా రియాక్ట్ అయ్యారు. ‘షర్మిలాజీపై నాకు గౌరవం ఉంది. కానీ, ఒక ఆర్టిస్ట్ అయి ఉండి ఆమె ఆలోచనలు ఇంత సంకుచితంగా ఉండటం నన్ను షాక్‌కు గురిచేసింది. సాహిత్యంలో, కవిత్వంలో వాడే పదాలు కేవలం రూపకాలు . బంకించంద్ర చట్టోపాధ్యాయ రాసిన వందేమాతరం స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి. మనలో దాగున్న ‘శక్తి’ని మేల్కొలపడానికి ఆయన ఆ పదాలు వాడారు తప్ప, దాన్ని కేవలం ఒక మతపరమైన పూజగా చూడకూడదు అని కంగనా క్లాస్ పీకారు.
►ALSO READ | ఇండియన్ మగాళ్లు వేస్ట్? యూరోపియన్ మెన్స్ బెస్ట్… మల్లికా షెరావత్ కామెంట్స్‌పై నెటిజన్లు ఫైర్!
ఒకరినొకరు ప్రేమిద్దాం..
అంతటితో ఆగకుండా స్వామి వివేకానందను ఉదాహరణగా చూపిస్తూ.. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, నరాల్లో ఉరుములు ప్రవహించే యువత నాకు కావాలని వివేకానంద అన్నప్పుడు ఆయన ఏమైనా వెదర్ రిపోర్ట్ ఇచ్చారా? అని కంగనా రనౌత్ పేర్కొన్నారు.. యువతలోని పవర్ పెంచడానికే అలా అన్నారు అని సూటిగా ప్రశ్నించారు. డాక్టర్లు కూడా శక్తిని ‘పవర్’ అనే అంటారని, కాబట్టి హిందూ-ముస్లిం మైండ్‌సెట్ నుంచి బయటకు వచ్చి అందరూ ఒకరినొకరు కౌగిలించుకుని ప్రేమిద్దామని షాక్ ఇచ్చారు. షర్మిల వాదనను ఖండిస్తూనే, చివరికి ఆమెపై తనకు ఎప్పటికీ అభిమానం ఉంటుందని పోస్ట్ ముగించారు కంగనా…