Reading Time: 2 minutes

రెమోలా ప్రేమ.. అపరిచితుడిలా టార్చర్.. అంబిలా క్షమాపణలు! : మాజీ ప్రియుడిపై అనుపమ షాకింగ్ కామెంట్స్!

Caption of Image.

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ‘టిల్లు స్క్వేర్’ భామ అనుపమ పరమేశ్వరన్ తన ప్రేమికుడి టార్చర్ ను మరోసారి బయటపెట్టారు. తమిళ హీరోతో  దాదాపు రెండేళ్లపాటు కొనసాగిన రిలేషన్‌షిప్ తన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీసిందని ఆమె వెల్లడించింది. తాను స్త్రీగా పుట్టినందుకు అసహ్యించుకునేలా చేశాడని లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో వాపోయింది..

 ఆ హీరో క్రూరమైన ప్రవర్తనను అనుపమ  బయటపెట్టింది. ఒకరోజు నాతో ‘రెమో’లాగా విపరీతమైన ప్రేమను చూపిస్తాడు. మరుసటి రోజే ‘అపరిచితుడు’లా మారి దారుణంగా హింసిస్తాడు. ఇక మూడో రోజు ‘అంబి’లాగా ఏడుస్తూ క్షమాపణలు కోరతాడు. అదొక ముగింపు లేని నరకపు సైకిల్ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. చివరికి ఆమె పీరియడ్స్ని, ఆఖరికి నటిగా తనకున్న గుర్తింపును కూడా హేళన చేస్తూ, తాను స్త్రీగా పుట్టినందుకు అసహ్యించుకునేలా చేశాడని వాపోయింది.

ఈ సమస్యలు వల్ల తన కెరీర్‌పైనా ప్రభావం చూపాయని అనుపమ తెలిపింది.. షూటింగ్‌లో ఉండగానే తన కుడి కన్ను అదుపు లేకుండా కొట్టుకోవడంతో షూట్ ఆపాల్సిన సందర్భాలు వచ్చాయని అనుపమ వెల్లడించింది. ప్రతి రాత్రి గంటల తరబడి ఏడ్చి.. మరుసటి రోజు షూటింగ్‌కు వెళ్లాల్సి వచ్చేదని చెప్పింది. ఈ క్రమంలో కన్నీళ్లు ఉత్పత్తి చేసే లాక్రిమల్ గ్లాండ్ వాపుకు గురై సాధారణ స్థానం నుంచి కిందికి జారడంతో చివరకు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని తెలిపింది. 

అయితే అనుపమ ఈ ఇంటర్వ్యూలో తన మాజీ ప్రియుడు పేరును మాత్రం ఎక్కడా వెల్లడించలేదు. అయితే ఆమెతో కలిసి ‘బైసన్’లో నటించిన ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియాలో విపరీతంగా వినిపిస్తోంది. గతంలో వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందంటూ రూమర్స్ వచ్చినప్పటికీ.. ఇద్దరూ దానిని అధికారికంగా ధృవీకరించలేదు.  ధృవ్ విక్రమ్ తో అనుపమ రిలేషన్ ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.  ఇటీవల వీరి మధ్య గొడవలు కూడా వచ్చాయని టాక్.

ALSO READ : RAAKA సెట్స్‌లో మంచు లక్ష్మి: ‘వింత జీవులు.. భారీ సెట్స్..

అటు ఇటీవల కూడా అనుపమ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఊహాగానాలను ఖండించింది. ధృవ్ కూడా ఇటీవల వ్యక్తిగత జీవితంపై పెరుగుతున్న పబ్లిక్ అటెన్షన్ గురించి స్పందించినప్పటికీ, ఎవరినీ పేరుపెట్టి ప్రస్తావించలేదు. ఇప్పుడు అనుపమ వ్యాఖ్యలు మరోసారి నెట్టింట్ హాట్ టాపిక్ గామారింది.. తన మాజీ ప్రియుడు ఇంత టార్చర్ పెట్టాడా? అని పెద్ద చర్చకు దారితీసింది.
 

 

©️ VIL Media Pvt Ltd.