Reading Time: 2 minutes

కరీనా కపూర్ ‘బేబీ నంబర్ 3’.. వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదే!

Caption of Image.

బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారారు. లేటెస్ట్ గా ఆమెకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరీనా మూడోసారి తల్లి కాబోతున్నారంటూ ఒక్కసారిగా ప్రచారం మొదలైంది. కారులోకి వెళ్తున్న సమయంలో ఆమెను చుట్టుముట్టిన సిబ్బంది కెమెరాలను అడ్డుకునేందుకు ప్రయత్నించడం ఈ అనుమానాలకు మరింత ఆజ్యం పోసింది.

అయితే ఈ ప్రచారానికి కరీనా టీమ్ చెక్ పెట్టింది. ఆమె గర్భవతి కాదని స్పష్టం చేసింది. అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘బేబీ నంబర్ 3’ వార్తలు పూర్తిగా అవాస్తవం అని తేల్చిచెప్పింది.. మరోవైపు, ఓ సన్నిహిత వర్గం సరదాగా స్పందిస్తూ.. ‘అది పాస్తా, పిజ్జా, వెకేషన్.. దానికి తోడు బ్యాడ్ కెమెరా యాంగిల్’ అంటూ రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టారు..

ఇది కరీనా విషయంలో కొత్తేమీ కాదు. 2022లోనూ వెకేషన్ ఫొటోల ఆధారంగా ఇలాంటి ప్రచారమే జరిగింది. అప్పట్లో కరీనా స్వయంగా సోషల్ మీడియాలో సరదాగా స్పందించి..  పాస్తా, వైన్ కారణంగానే అలా కనిపిస్తున్నానంటూ రూమర్లను కొట్టిపారేశారు.  సైఫ్ ఇప్పటికే మన దేశ జనాభాకు తగినంత కాంట్రిబ్యూట్ చేశారు అంటూ నవ్వులు పూయించారు.

►ALSO READ | హిందూ-ముస్లిం మైండ్‌సెట్ నుంచి బయటకు రండి.. షర్మిలాకు కంగనా స్ట్రాంగ్ రిప్లై!

కరీనా, సైఫ్ అలీఖాన్ 2012లో వివాహం చేసుకున్నారు. వీరికి తైమూర్, జహంగీర్ అలీఖాన్ ఇద్దరు కుమారులు ఉన్నారు. సైఫ్‌కు అమృతా సింగ్‌తో తొలి వివాహం ద్వారా సారా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్ కూడా ఉన్నారు. అంటే సైఫ్‌కు మొత్తం నలుగురు పిల్లలు. గతంలో కరీనా మాట్లాడుతూ.. సైఫ్ తన జీవితంలోని ప్రతి దశాబ్దంలో ఓ బిడ్డను కలిగి ఉన్నారని, ఇక 60ల్లో మాత్రం అది జరగదని తాను స్పష్టంగా చెప్పానని సరదాగా వ్యాఖ్యానించారు.

ఇటీవలే కుటుంబంతో కలిసి సైఫ్ 56వ పుట్టినరోజు వేడుకల కోసం బీచ్ వెకేషన్‌కు వెళ్లిన కరీనా.. అక్కడి ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ తర్వాతే ఈ కొత్త రూమర్లు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే.. కరీనా ప్రస్తుతం కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఆమె తదుపరి చిత్రం ‘ దాయిరా’ మేఘనా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో కరీనా, పృథ్వీరాజ్ సుకుమారన్ తొలిసారి కలిసి నటిస్తున్నారు. నిజ ఘటనల స్ఫూర్తితో రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 18, 2026న థియేటర్లలోకి రానుంది.

మొత్తానికి.. కరీనా మూడోసారి తల్లి కాబోతుందన్న వార్త వైరల్ అయినంత వేగంగా.. అది నిజం కాదు అన్న క్లారిటీ కూడా వచ్చేసింది. చివరకు ‘బేబీ నంబర్ 3’ పూకార్లకు పుల్ స్టాప్ పెట్టారు.

 

©️ VIL Media Pvt Ltd.